నిజామాబాద్ A9 న్యూస్:
రేషన్కార్డుల వివరాలు పారదర్శకంగా ఉండేలా ప్రభుత్వం కీలక నిర్ణయం తీసుకుంది. కార్డు ఉన్న ప్రతి కుటుంబంలో ఎవరెవరు ఉన్నారో తెలుసుకునేందుకు.. ఒకసారి కుటుంబ సభ్యులంతా రేషన్ దుకాణానికి వచ్చి ఈపాస్ యంత్రంలో “నో యువర్ కస్టమర్ ” పేరిట వేలి ముద్రలు వేయాల్సి ఉంటుంది. దీంతో ప్రతి కార్డులో మృతుల వివరాలు తొలగిపోయి.. బియ్యం, సరకుల కోటా తగ్గుతుందని ప్రభుత్వం భావిస్తోంది. త్వరలో ఈ ప్రక్రియ ప్రారంభం కానుంది.