నిజామాబాద్ A9 న్యూస్:
ఆర్మూర్ పట్టణంలోని అంబేద్కర్ చౌరస్తా వద్ద అంగన్వాడీ ఉద్యోగులు నిరసన వ్యక్తం చేశారు, అంగన్వాడి ఉద్యోగుల సమ్మెకు వివిధ పార్టీల నాయకులు సంఘీభావం తెలిపారు. ఈ సందర్భంగా నాయకులు మాట్లాడుతూ అంగన్వాడీ ఉద్యోగుల సమస్యలు పరిష్కరించాలని కోరుతూ సమ్మె చేస్తున్నామన్నారు. అంగన్వాడి ఉద్యోగులకు కనీస వేతనం 26,000 ఇవ్వాలని ఉద్యోగ భద్రత కల్పించాలని డిమాండ్ చేశారు.