నిజామాబాద్ A9 న్యూస్:
డాక్టర్ మధు శేఖర్ ను ఘనంగా సన్మానించిన అసోసియేషన్ ఆఫ్ సర్జన్స్ ఆఫ్ ఇండియా. డాక్టర్ మధు శేఖర్ తెలంగాణ ప్రభుత్వ ఆరోగ్యశాఖ, ఇండియన్ ఇన్స్టిట్యూట్ ఆఫ్ హెల్త్ అండ్ ఫ్యామిలీ వెల్ఫేర్ చైర్మన్ గా పదవి పొంది, ఇటీవల బాధ్యతలు తీసుకున్న శుభ సందర్భంగా అసోసియేషన్ ఆఫ్ సర్జన్స్ ఆఫ్ ఇండియా నిజామాబాద్ జిల్లా ఆధ్వర్యంలో నిజామాబాద్ జిల్లా కేంద్రంలోని వంశీ ఇంటర్నేషనల్ హోటల్లో ఘనంగా సన్మానించి శుభాకాంక్షలు తెలియజేశారు.
ఈ కార్యక్రమంలో పాల్గొన్న డాక్టర్లు ఆయన సేవలను కొనియాడారు. ఈ కార్యక్రమంలో జిల్లా సీనియర్ సర్జన్ డాక్టర్లు, డాక్టర్ జీవన్ రావు, డాక్టర్ నారాయణ, డాక్టర్ బాలరాజు, డాక్టర్ నరేంద్ర, డాక్టర్ గోవింద్, డాక్టర్ కృష్ణమూర్తి, డాక్టర్ రాఘవేందర్, డాక్టర్ చుహాన్, డాక్టర్ వెంకట్ గౌడ్, డాక్టర్ భాస్కర్ రెడ్డి, డాక్టర్ ముత్యం రెడ్డి, నిజామాబాద్, ఆర్మూర్ కు చెందిన ప్రముఖ సర్జన్ల డాక్టర్లు, ఆత్మీయ మిత్రులు పాల్గొన్నారు.