నిజామాబాద్ A9 న్యూస్:
తెలంగాణ విద్యార్థి పరిషత్ జిల్లా అధ్యక్షుడు బొబ్బిలి కళ్యాణ్ మరియు నగర అధ్యక్షుడు అఖిల్ ఆధ్వర్యంలో కలెక్టరేట్ ముందు ధర్నా నిర్వహించరు. అనంతరం కలెక్టర్ ఇతర కార్యక్రమాల్లో ఉండటం తో ఏవో కి వినతి పత్రం ఇవ్వడం జరిగింది.
నిజామాబాద్ నగరంలో ఉన్న అన్ని సాంఘిక సంక్షేమ హాస్టల్లో వార్డెన్లు విద్యార్థినీ విద్యార్థుల భద్రతను గాలికి వదిలేశారు ముఖ్యంగా మహిళా హాస్టల్లో కనీసం మౌలిక సదుపాయాలు కరువయ్యాయి కనీసం మహిళా హాస్టల్లో “సీసీటీవీ”లా భద్రత కూడా కల్పించలేకపోతున్నారు అదేవిధంగా విద్యార్థుల తల్లిదండ్రులు గాని ఏదైనా సమస్యపై విద్యార్థి నాయకులు గాని ఫోన్ చేసినా వార్డెన్లు స్పందించడం లేదు ఎమర్జెన్సీలో ఏదైనా మహిళకు ప్రాబ్లం జరిగినట్లయితే వార్డెన్లు ఇలాగే వ్యవహరిస్తున్నారు తల్లిదండ్రులు చెప్పిన బీసీ వెల్ఫేర్ ఆఫీస్ నుంచి కాల్ చేసినా కూడా స్పందించని తీరులో ఈ రోజు వార్డెన్లు వ్యవహరిస్తున్నారు వారిపై వెంటనే చర్యలు తీసుకోవాలని తెలంగాణ విద్యార్థి పరిషత్ డిమాండ్ చేస్తుంది లేని పక్షంలో వార్డెన్లను తొలగించే వరకు ఉద్యమాన్ని ఆపమని హెచ్చరించారు ఈ కార్యక్రమంలోసోహెల్ ,మహేష్ ,సుజిత్ , ఆఫ్టాబ్,ఇమ్రాన్, రెహమాన్, రంజాన్, అయాన్ ,రాజేష్, అదీబ్ ,అయాన్ తదితరులు పాల్గొన్నారు