కామారెడ్డి A9 న్యూస్:
భారీ వర్షం కురుస్తున్న నేపథ్యంలో ప్రజలు అప్రమత్తంగా ఉండాలి అత్యవసర సమయంలో తప్ప ఇంటి నుండి బయటకు రావద్దు ఎస్సై రాజు తెలిపారు.
కామారెడ్డి జిల్లా సదాశివనగర్ మండల్ వివిధ గ్రామ ప్రజలు భారీ వర్షాలు కురుస్తున్న నేపథ్యంలో ప్రజలు అత్యవసర సమయంలో తప్ప ప్రజలు ఇండ్ల నుండి బయటకు రావద్దని సదాశివనగర్ ఎస్సై ఎన్ రాజు సూచించారు సదాశివనగర్ మండల ప్రజలు భారీ వర్షాలు కురుస్తున్న నేపథ్యంలో పిల్లల తల్లిదండ్రులు పిల్లలను చెరువుల వద్దకు గాని కాలువల వద్దకు గాని వెళ్లకుండా తగిన జాగ్రత్తలు తీసుకోవాలి అన్నారు. ఈ సందర్భంగా సదాశివ నగర్ ఎస్సై ఎన్ రాజు మాట్లాడుతూ భారీ నుండి అతి భారీ వర్షాలు కురుస్తున్న నేపథ్యంలో వాగులు వంకలు పొంగి ప్రవహిస్తున్నాయి.
ఈ తరుణంలో ప్రజలు అప్రమత్తంగా ఉండాలి పొంగి ప్రవహిస్తున్న వాగులు కాలువలను దాటేందుకు ఎవరు ప్రయత్నించవద్దన్నారు పొలాల్లోకి వెళ్లే రైతులు విద్యుత్ స్తంభాలు మరియు బోరు మోటర్ దగ్గర్లోకి వెళ్ళవద్దని గ్రామాల్లో కూడా వీధుల్లో ఉన్న తడిసిన విద్యుత్ స్తంభాల దగ్గర్లోకి వెళ్లడం వాటిని ముట్టుకోవడం చేయరాదని ఇండ్ల వద్ద దుస్తులు ఆరేసేవారు కరెంటు తీగలు కేబుల్ వైర్లును తాకరాదని చిన్నారులను ఇంటి నుంచి బయటకు వెళ్ళనివ్వకూడదన్నారు ప్రజలు ఇళ్ల నుంచి బయటకు రాకుండా ఉండాలి అత్యవసర సమయంలో తప్ప ఇంటి నుండి బయటకు రావద్దు ఎవరైనా వరదలు చిక్కుకుంటే 100 కి ఫోన్ ద్వారా సమాచారం ఇవ్వాలి అధికారులకు సమాచారం అందివ్వాలి ప్రజలకు పోలీసులు అందుబాటులో ఉంటారని తెలిపారు.