నిజామాబాద్ A9 న్యూస్:

ఆదివారం ఉదయం 11 గంటలకు భారత విప్లవోద్యమ నేత సిపిఐ ఎంఎల్. కేంద్ర కమిటీ కార్యదర్శి కామ్రేడ్ రామచంద్రన్, 15వ వర్ధంతి సభ ఆర్మూర్ పట్టణ కేంద్రంలో నిర్వహిస్తున్నట్లు సిపిఐ ఎంఎల్ రామచంద్రన్ పార్టీ ఉత్తర తెలంగాణ కార్యదర్శి ఎస్ సుధాకర్ తెలిపారు.

ఈ సందర్భంగా వారు మాట్లాడుతూ సభను జయప్రదం చేయాలని ప్రజలకు పిలుపునిచ్చారు. కామ్రేడ్ రామచంద్రన్ కేరళ రాష్ట్రంలోని త్రిచూర్ జిల్లాలో జన్మించాడన్నరు. అక్కడ ప్రజా ఉద్యమంలో పాల్గొంటూ పార్టీలో పిలుపుమేరకు ముంబాయి వచ్చి అక్కడ కార్మిక రంగాన్ని, ఎయిర్ పోర్టులో కార్మిక రంగాన్ని బలోపేతం చేస్తూ ముంబై కాకుండా భారతదేశం మొత్తం కలియతిరుగుతూ 15రాష్ట్రాలకు సిపిఐ ఎంఎల్ పార్టిని ముందుకు తీసుకు వెళ్ళాడన్నారు.

ఈ క్రమంలో పార్టీ సమావేశంలో కామ్రేడ్ రామచంద్రన్ కొన్ని విప్లవ సంస్థలు కలిసి కేంద్ర కమిటీ కార్యదర్శిగా ఎన్నుకోవడం జరిగిందన్నారు. భారతదేశంలో విప్లవ సంస్థలన్నీ ఏకం కావాలని ముందుకు సాగుతున్న క్రమంలో ఆయన క్యాన్సర్ వ్యాధితో గత కొన్ని సంవత్సరాలుగా అనారోగ్యానికి గురై మృత్యువుతో పోరాడుతూ అనేక ఉద్యమాలు మొక్కవోని ధైర్యంతో ముందుకు సాగుతూ చివరకు ముంబై నగరంలో 31ఆగస్ట్2008వ సంవత్సరంలో రాత్రి పదిన్నర గంటలకు అమరత్వం పొందారన్నారు. ఆయన ఆశల కోసం ముందుండి పోరాడాలని ఆయన కన్నా కళల్ని నిజం చేయాలని వారు ప్రజలకు పిలుపునిచ్చారు.

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *