నిజామాబాద్ A9 న్యూస్:
నందిపెట్ మండలం దత్తపుర్ గ్రామానికి చెందిన ఎంపీటీసీ గంగదేవి మహేష్ దంపతులకు ఆర్మూర్ నియోజకవర్గ బీజేపీ నాయకుడు పైడి రాకేష్ రెడ్డి పార్టీ కండువా కప్పి పార్టీలోకి ఆహ్వనించారు. గతంలో బీజేపీలో గెలిచి బిఅర్ఎస్ పార్టీలోకి వెళ్లి తిరిగి సొంతగుటికి చేరడం జరిగిందన్నారు. ఈ సందర్భంగా వారు మాట్లాడుతూ అభివృద్ధి కోసం బిఅర్ఎస్ లోకి రావాలని ఒత్తిడి చేసి బలవంతంగా అధికార పార్టీలో చేర్చుకున్నారన్నారు. అయిన అభివృద్ధికి నిధులు ఇవ్వలేదు అని అన్నారు. బీజేపీకి రావడం సంతోషంగా ఉంది అన్నారు.
అభివృద్ధి బీజేపీతోనే సాధ్యం అని రాకేష్ రెడ్డి అధ్వర్యంలో ఆర్మూర్లో బీజేపీ గెలువడం తధ్యం అని అన్నారు. అనంతరం పైడి రాకేష్ రెడ్డి మాట్లాడుతూ అక్రమాలు, కబ్జాలు పోవాలి అంటే బీజేపీ గెలుపు ఆర్మూర్లో అత్యవసరం అన్నారు. అతి త్వరలో బీజేపీ లోకి ముఖ్య నాయకులు వస్తున్నారు, ఇప్పటికే పలువరు నాయకులు కూడా టచ్ లో ఉన్నారన్నారు.
ఈ కార్యక్రమంలో డొంకేశ్వర్ మండల అధ్యక్షుడు సురేందర్, ఎంపీటీసీలు సంజీవ్, చిన్నారెడ్డి బీజేపీ అసెంబ్లి కన్వీనర్ పలేపు రాజు, కళ్లెం సంతోష్ రెడ్డి తదితరులు పాల్గొన్నారు.