నిజామాబాద్ A9 న్యూస్:
భీంగల్ మండలంలోని పిప్రి గ్రామంలో ఎల్లమ్మ గుడి వద్ద పైపు కల్వర్టుకు మంత్రి ప్రశాంత్ రెడ్డి 2లక్షల 50వేల రూపాయల ప్రొసీడింగ్ ఇవ్వడం జరిగింది. గురువారం గ్రామంలోని గౌడ సంఘం పెద్దలకు ప్రొసీడింగ్ అందజేయడం జరిగింది.
ఈ కార్యక్రమంలో బిఆర్ఎస్ పార్టీ మండల అధ్యక్షులు దొనకంటి నర్సయ్య, సర్పంచ్ ఎస్పీ ప్రవీణ్, ఎంపీటీసీ అరిగెల స్వామి, బిఆర్ఎస్ పార్టీ గ్రామ శాఖ అధ్యక్షుడు భీమర్తి రాజేశ్వర్, వీడిసి అధ్యక్షుడు అరిగెల జనార్ధన్, బిఆర్ఎస్ పార్టీ నాయకులు, కార్యకర్తలు గౌడ సంఘ సభ్యులు పాల్గొన్నారు.