నిజామాబాద్ A9 న్యూస్:
*నందిపేట్ మండలంలో ఎమ్మెల్యే ప్రవాస్ యోజన కార్యక్రమంలో బిజెపి నాయకులు
నందిపేట్ మండల కేంద్రంలో భారతీయ జనతాపార్టీ ఆదేశాల మేరకు పార్టీ మండల అధ్యక్షుడు భూతం సాయరెడ్డి అధ్యక్షతన ఎమ్మెల్యే ప్రవస్ యోజన కార్యక్రమం నిర్వహించారు. ఈ కార్యక్రమానికి మహారాష్ట్ర ఎమ్మెల్యే సంజీవ్ రెడ్డి ముఖ్య అతిథిగా విచ్చేశారు. ఈ సందర్భంగా ఎమ్మెల్యే సంజీవ్ రెడ్డి మాట్లాడుతూ బీజేపీ పథకాలు ప్రతి ఇంటికి చేరవేయలని,బూత్ ల వారిగా కొత్త వారిని చేర్చాలని అన్నారు, పైడి రాకెష్ రెడ్డి మాట్లాడుతూ ఆర్మూర్ ఎమ్మెల్యే జీవన్ రెడ్డి కి ఇదే చివరి ఎన్నిక అని ఇక ఎమ్మెల్యే జీవన్ రెడ్డి రాజకీయ సన్యాసం పక్క అని బీజేపీ కార్యకర్తల కోసం ఎల్లవేళలా అందుబాటులో ఉంటాం అని ఈ నాలుగు నెలలు అత్యంత కీలకమైన రోజులు అని భయంతో ఎమ్మెల్యే జీవన్ రెడ్డి ర్యాలీ కి ప్రజలు వెళ్లారు అని మద్యానికి బానిసలుగా మారుస్తు,హత్యలు చేస్తున్న ఎమ్మెల్యే కి వీడ్కోలు పార్టీ అని అన్నారు.ప్రజా ఆశీర్వధ ర్యాలి పేరిట అమాయక ప్రజలను భయంతో ర్యాలీకి తీసుకవేళ్లడం సిగ్గు చేటు అని అన్నారు అనంతరం నందిపెట్ గ్రామానికి చెందిన 40మంది యువకులు బీజేపీ లో చేరడం జరిగింది.
ఈ కార్యక్రమంలో ఆర్మూర్ బీజేపీ అసెంబ్లీ కన్వీనర్ పాలెపు రాజు, శ్రీనివాస్,చిన్న రెడ్డి తదితరులు పాల్గొన్నారు.