నిజామాబాద్ A9 న్యూస్:
నిజామాబాద్ ఎమ్మెల్సీ కల్వకుంట్ల కవిత ఆర్మూర్ ఎమ్మెల్యే ప్రజా ఆశీర్వాద ర్యాలీలో పాల్గొన్నారు. ఈ సందర్భంగా కాంగ్రెస్, బిజెపి ప్రభుత్వాలపై తీవ్రస్థాయిలో ధ్వజమెత్తారు. ఉద్యమాల పార్టీ కావాలనో లేక ఇతర పార్టీల వైపు మొగ్గు చూపుతారో ప్రజల్ని తేల్చుకోవాలన్నారు.
నిజామాబాద్ జిల్లా ఆర్మూర్ ఎమ్మెల్యే రానున్న శాసనసభ ఎన్నికల్లో టికెట్ కేటాయించిన తర్వాత మొదటిసారి నియోజకవర్గానికి రావడంతో భారీ స్థాయిలో పార్టీ నాయకులు, కార్యకర్తలు ప్రజా ఆశీర్వాద ర్యాలీ ఘనంగా నిర్వహించారు. ఈ కార్యక్రమానికి ముఖ్య అతిథిగా హాజరైన నిజామాబాద్ ఎమ్మెల్సీ కల్వకుంట్ల కవిత మాట్లాడుతూ కాంగ్రెస్, బిజెపి ప్రభుత్వాలపై తీవ్ర స్థాయిలో ధ్వజమెత్తారు. ఉద్యమాల పార్టీ కావాలనో, సంక్షేమ పథకాలు అందించి ప్రజల వైపు ఉన్న పార్టీ కావాలనో లేక ఇతర పార్టీల వైపు మొగ్గు చూపుతారో ప్రజలే తెలుసుకోవాలని. రైతులకు మూడు గంటల కరెంటు ఇస్తామన్న కాంగ్రెస్ పార్టీ వైపు ప్రజలు మొగ్గుచూపుతారా లేక మోటార్లకు మీటర్లు పెడతామన్న బిజెపిని దగ్గరకు తీస్తారా లేక 24 గంటల ఉచిత కరెంటును రైతులకు అందిస్తున్న ముఖ్యమంత్రిని ఆశీర్వదిస్తారా అంటూ ప్రజలను ఉద్దేశించి ఆమె మాట్లాడారు. ఆర్మూర్ ఎమ్మెల్యేను రానున్న ఎన్నికల్లో ముచ్చటగా మూడోసారి 60 వేల ఓట్ల మెజారిటీతో గెలిపించాలని ఆమె కోరారు.