నిజామాబాద్ A9 న్యూస్:
ఇందల్వాయి మండలంలోని లోలం, ఎల్లారెడ్డి పల్లె, తిర్మన్ పల్లి, గ్రామాల్లో విస్తృతంగా గడప గడప కార్యక్రమంలో ప్రధాన కార్యదర్శి నాగేష్ రెడ్డి మూడు గ్రామాలలో విస్తృతంగా ప్రచారాన్ని నిర్వహించారు ప్రతి మనిషిని మంచి చెడ్డలు అడిగి తెలుసుకున్నారు. తెలంగాణ ఇచ్చింది మన సోనియా గాంధీ అని ఆయన ప్రజలకు గుర్తు చేశారు.
తెలంగాణ తెచ్చుకొని దొంగల చేతిలో పెట్టినట్టుగా అయిపోయిందని ఆయన ప్రజలతో అన్నారు. కాంగ్రెస్ ప్రభుత్వం వచ్చాక కళ్యాణ లక్ష్మి, షాదీ ముబారక్, కొనసాగింపు మరింత పెంచుతామని, పేదలకు ఇందిరమ్మ ఇల్లు నిర్మాణానికి ఐదు లక్షల రూపాయలు ఆర్థిక సాయం అందజేస్తామని అన్నారు. రాజీవ్ గాంధీ ఆరోగ్యశ్రీ ఐదు లక్షల బీమా ను తక్షణమే అందింప చేస్తామని ఉచిత భీమా సౌకర్యం కూడా కల్పిస్తామని అన్నారు.
రైతు పండించిన పంటకు గిట్టుబాటు ధర వచ్చే విధంగా చూస్తాం, వరి ధాన్యం 2500 వరకు మొక్కజొన్న 2200 వరకు పంచుతామని అన్నారు. కాంగ్రెస్ ప్రభుత్వం ఏర్పడగానే నిరుద్యోగ యువతకు ఉద్యోగాలు వచ్చే విధంగా చేస్తాం, గతంలో కాంగ్రెస్ ప్రభుత్వం హయాంలో ఇచ్చిన విధముగా విద్యార్థిని విద్యార్థులకు ఫీజు రీ మెంబర్ మెంట్ సౌకర్యం వర్తింప చేస్తామని అన్నారు.
ఆడపిల్లలకు కాంగ్రెస్ ప్రభుత్వం ఇచ్చే కానుక పద్ధతి సంవత్సరాలు పైబడిన చదువుకునే విద్యార్థినిలకు ఎలక్ట్రానిక్ స్కూటీ అందజేస్తాం, రైతు నీ రాజు చేయడమే మా లక్ష్యం రాహుల్ గాంధీ తోనే సాధ్యం కాంగ్రెస్ ప్రభుత్వం అధికారంలోకి రాగానే ప్రజలకు అందించే పథకాలు గ్యాస్ సిలిండర్ 500 రూపాయలకే, రైతులకు రెండు లక్షల రుణమాఫీ, ఎకరానికి 15000 పెట్టుబడి సాయం రైతుబంధు భూమిలేని ఉపాధి హామీ కూలీలకు సంవత్సరానికి 12,000 రూపాయలు ఆర్థిక సాయం అందజేస్తామని అన్నారు. ఆసరా పింఛన్ కొనసాగిస్తూ నాలుగువేల వరకు పెంచుతామని గుర్తు చేశారు.
మహిళలందరికీ ఉచిత బస్సు సౌకర్యం కూడా కల్పిస్తుంది కాంగ్రెస్ ప్రభుత్వం, ఈ కార్యక్రమంలో మండల అధ్యక్షురాలు జంగిల్ లక్ష్మి, గన్నారం ఉపసర్పంచ్ బయరయ్య, కర్ణాకర్ ప్రభాకర్, మరియు కాంగ్రెస్ కార్యకర్తలు తదితరులు పాల్గొన్నారు.