Tuesday, November 26, 2024

అంగన్వాడి ఉద్యోగుల సమస్యలను పరిష్కరించాలి..!

spot_img
- Advertisement -spot_imgspot_img
- Advertisement -spot_imgspot_img

నిజామాబాద్ A9 న్యూస్:

అంగన్వాడి ఉద్యోగుల సమస్యలు పరిష్కరించాలని బుధవారం జిల్లా అదనపు కలెక్టర్ పి.యడి రెడీ, ఐసిడిఎస్ పీడీ కి వినతి పత్రం ఇచ్చి చర్చించటం జరిగింది. ఈ సందర్భంగా అంగన్వాడీ యూనియన్ జిల్లా అధ్యక్షులు ఏ రమేష్ బాబు మాట్లాడుతూ 38 సంవత్సరాలుగా అంగన్వాడీ ఉద్యోగులకు టీ.ఏ.డీ.ఏ.లు ఇవ్వకుండా ఉన్నారని అదేవిధంగా ఇవ్వక పోవటంతో ఇంటి యజమానులు ఇబ్బందులు పెడుతున్నారని అదేవిధంగా,

కరోనా సమయంలో అంగన్వాడీ ఉద్యోగుల నుండి కోతలు పెట్టిన వేతనాల్లో 1000 రూపాయలు ఇంతవరకు ఇవ్వలేదని పెరిగిన వేతనాల్లో ఒక నెల బకాయిలో ఉన్నాయని, వాటిని వెంటనే చెల్లించాలని వారు కోరారు. అదేవిధంగా అంగన్వాడీ కేంద్రాలలో ఖాళీలను భర్తీ చేయాలని బి ఎల్ ఓ డ్యూటీలకు ఆయాలు లేని కేంద్రాలకు , అనారోగ్యంతో ఉన్నవారికి వయసు పైబడిన వారికి బిఎల్ఓ విధుల నుంచి మినాయింపు ఇవ్వాలని వారు కోరారు.

ఈ సందర్భంగా అదనపు కలెక్టర్ మాట్లాడుతూ సమస్యల పరిష్కారానికి కృషి చేస్తానని హామీ ఇవ్వటం జరిగింది. ఈ కార్యక్రమంలో అంగన్వాడీ ఉద్యోగుల సంఘం, జిల్లా ప్రధాన కార్యదర్శి పి స్వర్ణ, జిల్లా వర్కింగ్ ప్రెసిడెంట్ పి చంద్రకళ, జిల్లా నాయకులు ఎలిజిబెత్ రాణి, మరియు గోదావరి, విజయ, లక్ష్మి, నాయకులు తదితరులు పాల్గొన్నారు.

+ posts
- Advertisement -spot_imgspot_img
Latest news
spot_img
- Advertisement -spot_img
Related news
- Advertisement -spot_img

LEAVE A REPLY

Please enter your comment!
Please enter your name here