నిజామాబాద్ A9 న్యూస్:

నరేంద్ర మోడీ ప్రభుత్వ కార్మిక, ప్రజా వ్యతిరేక విధానాలకు నిరసనగా జాతీయ కమిటీ పిలుపుమేరకు ఆగస్టు 29న చలో హైదరాబాద్ కార్యక్రమాలలో కార్మికులు పెద్ద ఎత్తున పాల్గొని జయప్రదం చేయాలని ఐఎఫ్టియు రాష్ట్ర ఉపాధ్యక్షులు దాసు, కార్మిక లోకానికి పిలుపును ఇచ్చారు. చలో హైదరాబాద్ పోస్టర్లను ఆర్మూర్ పట్టణంలోని మామిడిపల్లిలో ఆగస్టు 22న ఆవిష్కరించారు. ‌

మోడీ ఎన్నికల వాగ్దానాలు విస్మరించి,ప్రభుత్వ రంగ సంస్థలను ప్రైవేటు పరం చేయడం,అమ్మకానికి పెట్టడం,కాంట్రాక్ట్ ఔట్ సోర్సింగ్, స్కీమ్ వర్కర్లను ప్రభుత్వ ఉద్యోగులుగా గుర్తించకుండా, 4 కార్మిక వ్యతిరేక లేబర్ కోడ్ లను తెచ్చి కార్మికులను కట్టు బానిసలుగా మార్చే కుట్ర చేస్తున్నారని ఆయన ఆవేదన వ్యక్తం చేశారు. నరేంద్ర మోడీ ప్రతి సంవత్సరం రెండు కోట్ల మందికి కొలువులు ఇస్తామని మాట నీళ్ల మూటగా మారిందని ఆయన అన్నారు.

స్వచ్ భారత్ లో ముందు వరుసలో ఉండి కృషి చేస్తున్న సఫాయి కార్మికులను శాలువా కప్పి సన్మానిస్తే సరిపోదని 2016 అక్టోబర్ 26 తేదీన సుప్రీంకోర్టు తీర్పును ప్రకారం సమాన పనికి సమాన వేతనం కార్మికులకు అమలు చేయించాలని మోడీ ప్రభుత్వాన్ని దాసు డిమాండ్ చేశారు. దేశంలో ఉన్న కార్మికులందరికీ పిఎఫ్, ఈఎస్ఐ చట్టాలను అమలు చేయాలని ఆయన డిమాండ్ చేశారు. ప్రధాని నరేంద్ర మోడీ బాటలో రాష్ట్ర ముఖ్యమంత్రి కేసీఆర్ ప్రయనించకుండా, కార్మిక హక్కుల అమలుపై కృషి చేయాలని ఆయన కోరారు.

కెసిఆర్ గ్రామపంచాయతీ కార్మికుల సమ్మె సందర్భంగా ఇచ్చిన మాటను నిలబెట్టుకోవాలని, లేనిచో కార్మికుల కోపాగ్నికి బలికాక తప్పదని ఆయన హెచ్చరించారు. ఐ ఎఫ్ టి యు జాతీయ కమిటీ ఇచ్చిన పిలుపు లో భాగంగా, ఆగస్టు 29 న, ఛలో హైదరాబాద్ ఇందిరాపార్క్ వద్ద మహా ధర్నాను నిర్వహిస్తున్నామని ధర్నా లో అన్ని రంగాల కార్మికులు అధిక సంఖ్యలో పాల్గొని విజయవంతం చేయాలని పిలుపును ఇచ్చారు.

ఈ కార్యక్రమంలో ఐఎఫ్టియు నాయకులు సూర్య శివాజీ ఎండి కాజా మొయినుద్దీన్ భానుచందర్, బీడీల మదర్, సధానంద్, తదితరులు పాల్గొన్నారు.

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *