నిజామాబాద్ A9 న్యూస్ :
ఆర్మూర్ పట్టణంతో పాటు మండలంలోని గ్రామాల్లో ప్రజలు నాగుల పంచమి పండుగను ఘనంగా జరుపుకున్నారు.నాగుల పంచమి సందర్భంగా పుట్టలో పాలు పోసి మొక్కలు చెల్లించుకున్నారు.
పట్టణంలోని కుక్కల గుట్ట, వీరభద్ర ఆలయం, మామిడిపల్లి హనుమాన్ ఆలయాల్లో గల పుట్టలో భక్తులు పాలు పోసి తమ మొక్కులు చెల్లించుకున్నారు. ఈ సందర్భంగా భక్తులు మాట్లాడుతూ నాగుల పంచమినాడు నాగ దేవత పుట్టలో పాలు పోయడం వల్ల సకల దుఃఖాలు దూరమై ఆయురారోగ్యాలు అష్టైశ్వర్యాలతో ఉంటారని తెలిపారు.