నిజామాబాద్ A9 news:
ఆర్మూర్ నియోజకవర్గం పిప్రి గ్రామంలో పద్మశాలి లు రాజకీయంగా ఆర్ధికంగా మరింత ఎదగాలని కలసి కట్టుగా సమాజం కోసం ఉద్యమించాలని పద్మశాలి సంక్షేమ సేవ సమితి అధ్యక్షులు మ్యాక మోహన్ దాస్, ప్రధాన కార్యదర్శి కోక్కుల రమాకాంత్ అన్నారు. అఖిల భారత పద్మశాలి సంఘం మరియు తెలంగాణ ప్రాంత పద్మశాలి సంఘం సెప్టెంబర్ 3వ తేదీన సరూర్ నగర్ స్టేడియం హైదరాబాద్ లో నిర్వహిస్తున్న పద్మశాలి రాజకీయ శంఖారావం పోస్టర్ లను ఆదివారం ఆర్మూర్ నియోజకవర్గం పిప్రి గ్రామములో, బాల్కొండ నియోజకవర్గం, మోర్తాడ్ మండలం తిమ్మాపూర్ గ్రామములో, మోర్తాడ్ పద్మశాలి సంఘం అధ్యక్షులు చిలివేరీ రవి, మరియు పిప్రి పద్మశాలి అధ్యక్షులు నాందాల లింబాద్రి, మనోహర్ మరియు సభ్యులతో తో కలసి ఆవిష్కరించారు.
ఈ సందర్బంగా మ్యాక మోహన్ దాస్ మాట్లాడుతూ పద్మశాలు రాజకీయంగా ఎదిగినప్పుడే వారి సమస్యలు పరిష్కారం అవుతాయని అన్నారు. రాష్ట్రం లో పెద్ద సంఖ్యలో పద్మశాలిలు ఉన్నప్పటికీ రాజకీయంగా అణచి వేయబడుతున్నారని అన్నారు. పద్మశాలి ల ఆత్మ గౌరవం అందరు చైతన్య వంతులై కదం తొక్కల్సిన ఉందని అన్నారు.
చిలివేరి రవి మాట్లాడుతూ మన ఓటు, మన సీటు మన వాటా ప్రకారం పద్మశాలి లకు కేటాయించాలని వివిధ పార్టీలకు అల్టీమేటం జారీ చేయాలనీ అన్నారు.కొక్కుల రమాకాంత్ మాట్లాడుతూ పద్మశాలి లు కుటుంబానికి ఒక్కరు చొప్పున సభకు హాజరై విజయవంతం చేయాలని కోరారు.
ఈ కార్యక్రమం లో మామిడి పల్లి తర్ప మాజీ అధ్యక్షులు,అడెల్లి శ్రీనివాస్, ఆర్మూర్ పద్మశాలి తర్ప 2 అధ్యక్షులు బండి అనంత్ రావు, పిప్రి పద్మశాలి సంఘం అధ్యక్షులు నందల లింబాద్రి, కొక్కుల మనోహర్, తిమ్మాపూర్ పద్మశాలి సంఘం చాట్ల సత్యనారాయణ తదితరులు పాల్గొన్నారు.