నిజామాబాద్ A9 news
భారతీయ జనతా పార్టీ రాష్ట్ర శాఖ పిలుపుమేరకు ఆర్మూర్ అసెంబ్లీ కన్వీనర్ పాలెపు రాజు ఆధ్వర్యంలో ఎమ్మెల్యే ప్రవస్ యోజన లో భాగంగా ఆర్మూర్ వచ్చినటువంటి మహారాష్ట్ర వణి నియోజకవర్గ ఎమ్మెల్యే సంజీవరెడ్డి బాపూరావు ఆదివారం ఆర్మూర్ అసెంబ్లీ పరిధిలో కార్యకర్తలతో సమావేశం నిర్వహించడం జరిగింది.
ఈ కార్యక్రమంలో ముఖ్య అతిథిగా వచ్చిన మహారాష్ట్ర వాణి నియోజకవర్గ ఎమ్మెల్యే సంజీవరెడ్డి బాబురావు పార్లమెంట్ సభ్యులు ధర్మపురి అరవింద్ మాట్లాడుతూ..
భారతీయ జనతా పార్టీ రాష్ట్ర శాఖ పిలుపుమేరకు ఆర్మూర్ కి రావడం జరిగింది. ఇక్కడికి వచ్చిన తర్వాత స్థానికంగా ఉన్నటువంటి ఎమ్మెల్యే జీవన్ రెడ్డి రౌడీ రాజకీయాలు తన అక్రమ సంపాదన గురించి తెలిసి ఆశ్చర్యపోయాను తెలంగాణలో అత్యంత దోపిడీకి గురైన ఏదైనా అసెంబ్లీ నియోజకవర్గము ఉందని ఆర్మూర్ అయిన ని తెలుసుకున్నాను ఇక్కడున్న నాయకుడు ఎమ్మెల్యే కార్యకర్తలను బెదిరింపులకు గురి చేయడం అక్రమ కేసులు పెట్టడం వారికి అనేక రకాలుగా ఇబ్బంది కలిగించడం చేస్తున్నాడు, ఈ ఎనిమిది రోజులు ఎమ్మెల్యే ప్రభాస్ యోజన లో భాగంగా ఈ యొక్క నియోజకవర్గం లో ప్రతి మండలానికి తిరుగుతానని ప్రతి మండలంలో ఒకరోజు తిరిగి కార్యకర్తల సంబంధించిన విషయాలు గానీ ప్రజలు పడుతున్న ఇబ్బందులు కానీ ప్రధానమంత్రి నరేంద్ర మోడీ పథకాలను వివరిస్తూ ఇక్కడ ఎమ్మెల్యే గెలుపుకి మోడీ పథకాలే ప్రాబణీతనిస్తూ గెలుపే లక్ష్యంగా పనిచేస్తారని చెప్పేసి భావిస్తున్నాను. ఇక్కడి నాయకులు వారి శక్తి మేరకు కష్టపడుతూ పార్టీని ముందుకు తీసుకెళ్తున్నారని మహారాష్ట్రలో నా కాంసెన్సీలో నేను కేవలం 12 గంటల ముందే ఎమ్మెల్యే అభ్యర్థిగా ప్రకటించబడి న గెలుపు 24 వేట్ల ఓట్ల మెజారిటీతో గెలిచాను దీనికి ముఖ్య కారణం భారతీయ జనతా పార్టీ ఏదైతే సిద్ధాంత పరంగా కార్యకర్తలు నిర్మాణంగా ఉన్న వారి సహకారాలు నాకు ఉండడంవల్ల 12 గంటల్లోనే వారిని చేరుకొని ఈ గెలుపు నాకు చేరిపోయిందని భావిస్తున్నాను అలాగే ఇక్కడ కార్యకర్తలు భూత అధ్యక్షులు మరియు అనుబంధ సంఘాలు పనిచేయడం వల్లనే భారతీయ జనతా పార్టీ గెలుపు సునాయసమవుతుందని భావిస్తున్నాను. ఈ ఆర్మూర్ నియోజకవర్గంలో కూడా పూర్తి అధ్యక్షులు స్థాయి నుంచి నిర్మాణం జరిగి ఇక్కడ గెలుపు లక్ష్యం చేరుకుంటామని చెప్పి మనస్పూర్తిగా భావిస్తున్నాను. ఇక్కడ ఈ ఎమ్మెల్యే యొక్క అరాచకాలను తిప్పి కొట్టడానికి భారతీయ జనతా పార్టీ కరెక్ట్ అని ప్రజలు నమ్ముతున్నారు.
ఈ కార్యక్రమంలో సీనియర్ నాయకులు అల్జాపూర్ శ్రీనివాస్, పెద్దల గంగారెడ్డి, మారంపల్లి గంగాధర్, కంచేటి గంగాధర్, నరసింహారెడ్డి, పైడి రాకేష్ రెడ్డి, విజయభారతి, యామాద్రి భాస్కర్, నూతల శ్రీనివాస్ రెడ్డి, జెస్సు అనిల్, మండల అధ్యక్షులు కార్యదర్శులు మరియు నాయకులు కార్యకర్తలు పాల్గొన్నారు.