నిజామాబాద్ A9 news
నందిపేట వేదికగా అసెంబ్లీ ఎన్నికల ప్రచారం ప్రారంభం……
నందిపేట్ మండల కేంద్రంలోని 163 వ బూతులో, 20 మంది ఇన్చార్జిలకు 60 ఓట్ల చొప్పున బాధ్యత ఇచ్చి, 163వ బూతులో ఇంటింటికి వెళ్లి వచ్చే ఎన్నికల్లో భారత రాష్ట్ర సమితి పార్టీ అభ్యర్థి జీవన్ రెడ్డి కి ఓటు వేసి గెలిపించాలని ప్రచారం నిర్వహించడం జరిగింది.
ఈ సందర్భంగా నందిపేట మండల భారత రాష్ట్ర సమితి పార్టీ అధ్యక్షుడు మచ్చర్ల సాగర్ మాట్లాడుతూ, దేశంలోనే తెలంగాణ రాష్ట్రాన్ని సంక్షేమ అభివృద్ధి కార్యక్రమాలలో నెంబర్ వన్ గా తీర్చిదిద్ది, దేశం మొత్తం తెలంగాణ వైపు చూసే విధంగా పరిపాలన చేస్తున్న కేసీఆర్ నాయకత్వాన్ని బలపరచాలని, తెలుగు రాష్ట్రాల్లో హ్యాట్రిక్ ముఖ్యమంత్రిగా కెసిఆర్ చరిత్ర సృష్టిస్తారని, నందిపేట పట్టణాన్ని సర్వాంగ సుందరంగా తీర్చిదిద్దడానికి, 12 కోట్ల రూపాయలతో డివైడర్ సెంట్రల్ లైటింగ్, 6 కోట్ల రూపాయలతో సిసి డ్రైనేజీలు రోడ్లు, 3కోట్ల రూపాయలతో వివిధ కుల సంఘాల కళ్యాణ మండపాలు, 2కోట్ల రూపాయలతో కుల సంఘ భవనాలు నిర్మిస్తూ,పేద బడుగు బలహీన వర్గాల కోసం 18 గంటలు పనిచేస్తున్న జీవన్ రెడ్డి ని 60 వేల ఓట్ల మెజార్టీతో గెలిపించాలని కోరడం జరిగింది,అనంతరం గొడుగులు పంపిణీ చేయడం జరిగింది.
ఈ కార్యక్రమంలో 163వ బూత్ సభ్యులు ఉమ్మెడ ఉషన్న, మంతెన శ్రీనివాస్, మంతెన హరిబాబు, ఆర్మూర్ చిన్న గంగారం, నాగ చిన్నయ్య, ఉమ్మడ అశోక్, ఎడ్డిగారి దినేష్, మచ్చర్ల సతీష్ ,నాగ శివ, సాకలి నరసయ్య, సాకలి దేవన్న, సుంకరి సుమన్ , సుంకరి మహేష్, మంతెన చిన్నయ్య, ఎడ్డిగారి నరేష్, బీఆర్ఎస్ పార్టీ నాయకులు పాల్గొన్నారు.