నిజామాబాద్ A9 news

రోటరీ క్లబ్ ఆఫ్ ఆర్మూర్ ఆధ్వర్యంలో అంతర్జాతీయ ఫోటోగ్రఫీ దినోత్సవాన్ని పురస్కరించుకొని సీనియర్ ఫోటోగ్రాఫర్లకు సన్మాన కార్యక్రమాన్ని నిర్వహించారు. 

 

ఈ సందర్భంగా రోటరీ క్లబ్ అధ్యక్షుడు పట్వారి గోపికృష్ణ మాట్లాడుతూ ఫోటోగ్రాఫర్ల యొక్క ఫోటో అమూల్యమైందని,చరిత్రను నిలుపుతోందని, మానవ సంబంధాలను పెంచుతుందని, కొన్ని తరాలకు మధుర స్మృతులను అందిస్తుందని పేర్కొన్నారు.

ఈ కార్యక్రమంలో కార్యదర్శి తులసి, కోశాధికారి లక్ష్మీనారాయణ,ప్రాజెక్టు చైర్మన్ రాజేందర్, మాజీ అధ్యక్షులు ప్రవీణ్ పవర్,దామోదర్, ఉపాధ్యాయులు,విద్యార్థులు, ఫోటోగ్రాఫర్లు, తదితరులు ఉన్నారు.

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *