నిజామాబాద్ A9 news
ఆర్మూర్ పట్టణంలోని మామిడిపల్లి చౌరస్తా నుండి అంబేద్కర్ చౌరస్తా వరకు ఎన్నికల సంఘం ఆదేశాల మేరకు రెవెన్యూ శాఖ ఆధ్వర్యంలో ఓటు హక్కు ప్రాధాన్యతను వివరిస్తూ 5కే రన్ కార్యక్రమాన్ని నిర్వహించారు.
ఈ కార్యక్రమానికి ఆర్మూర్ ఆర్డీవో వినోద్ కుమార్ ముఖ్యఅతిథిగా హాజరై 5కే రన్ ప్రారంభించారు. ఈ సందర్భంగా ఆయన మాట్లాడుతూ భారత్ ఎన్నికల సంఘం ఆదేశాల మేరకు ఐ ఓట్ ఫర్ షూర్, సిస్టమాటిక్ ఓటర్స్ ఎడ్యుకేషన్ అండ్ ఎలక్టోరల్ పార్టిసిపేషన్ కార్యక్రమంలో భాగంగా 5కే రన్ నిర్వహించడం జరిగిందని అన్నారు. ప్రతి ఒక్కరూ తమ ఓటు హక్కును ఎన్నికల్లో వినియోగించుకునేలా అవగాహన కార్యక్రమాలు నిర్వహిస్తున్నామని తెలిపారు.
ఈ కార్యక్రమంలో తాసిల్దార్ శ్రీకాంత్,డిప్యూటీ తాసిల్దార్ వినోద్, ఆర్ ఐ అశోక్, సర్వేయర్ రాజు, మున్సిపల్ కమిషనర్ ప్రసాద్, ఎంఈఓ రాజ గంగారం, ఎస్సైలు అశోక్, గంగాధర్, వివిధ శాఖల పట్టణ, మండల స్థాయి అధికారులు, సిబ్బంది,తదితరులు ఉన్నారు.