A9 న్యూస్ ప్రతినిధి ఆర్మూర్:
ఆర్మూర్ పట్టణంలోని ఆర్టీసి కొత్త బస్టాండ్‌లో ఆర్మూర్ పోలీస్ స్టేషన్ ఇన్స్పెక్టర్ ఆఫ్ పోలీస్, సిబ్బందితో ఆకస్మిక తనిఖీలు చేశారు. మాదకద్రవ్యాలు మరియు ఇతర చట్టవిరుద్ధ పదార్థాలను ప్రాంగణాన్ని క్షుణ్ణంగా తనిఖీ చేశారు. అనుమానాస్పద వ్యక్తులు, మూటల పై నివారణ తనిఖీలు నిర్వహించారు. ఈ తనిఖీలో గుర్తించడానికి శిక్షణ పొందిన స్నిఫర్ డాగ్స్ సహాయంతో ఈ ఆపరేషన్ నిర్వహించబడింది అని సీఐ సత్యనారాయణ గౌడ్ తెలిపారు.