భీంగల్ లో కళ్యాణ లక్ష్మీ చెక్ ల పంపిణీ కార్యక్రమానికి వచ్చిన ఇంచార్జ్ మినిస్టర్ జుపాల్లి కృష్ణారావు గారిని ఈ ప్రాంత ఎమ్మెల్యేగా బాధ్యతగా సాదర స్వాగతం పలికాను.
ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి ఎన్నికలప్పుడు ఇప్పుడైతే లక్ష వచ్చే నెల ఇందిరమ్మ రాజ్యం వచ్చాక లక్ష తో పాటు తులం బంగారం అని హామీ ఇచ్చాడు
16 నెలలు అయ్యింది ఇప్పటి వరకు ఇచ్చిన కళ్యాణ లక్ష్మీ తో పాటు ఒక్కరికి తులం బంగారం ఇవ్వలేదు.
2500 ప్రతి మహిళలకు, 4000 రూపాయల పెన్షన్ అమలు చేయలేదు
ఋణమాఫీ ఈ నియోజకవర్గంలో 50 వేల పైన రైతులు ఉంటే 20 వేల మందికి అయ్యింది ఇంకా 30 వేల రైతులకు కాలేదు
రైతు బంధు మార్చ్ 31 కళ్ళ టకీ టకీ మని పడుతుంది అన్నారు ఇప్పటి వరకు అమలు కాలేదు.
ప్రజల పక్షాన కాంగ్రెస్ ప్రభుత్వం ఇచ్చిన హామీలపై అడిగితే మంత్రి అప్పులయినాయి పిండి కొద్దీ రొట్టె అంటూ నిరాధార ఆరోపణలు చేస్తూ తప్పించుకొని ప్రయత్నం చేసాడు.
అప్పులు ఎంత అయిన సంగతి గత ప్రభుత్వం ప్రతి సంవత్సరం అసెంబ్లీలో బడ్జెట్ సమావేశాల్లో పెట్టింది
ఇవన్నీ తెలిసి కూడా కాంగ్రెస్ పార్టీ,రేవంత్ రెడ్డి బట్టి విక్రమార్క అధికారము కోసం ఎన్నికల్లో అనేక హామీలు ఇచ్చింది.
హామీలు అమలు చేయమని ప్రజల పక్షాన మా కార్యకర్తలు బయట ప్రశ్నిస్తే పోలీసులతో లాఠీ ఛార్జ్ చేపించారు.
పోలీసు లాఠీ ఛార్జ్ లకు ,ఉడత బెదిరింపులకు ఇక్కడ ఎవడు భయపడే వాడు లేడు.
భీంగల్ సి.ఐ , పోలీసులు కావాలని కాంగ్రెస్ పార్టీ కనుసన్నల్లో పని చేస్తూ మా BRS పార్టీ నాయకులపై ఇష్టారీతిగా లాఠీ ఛార్జ్ చేశారు.
ప్రతి రోజు సండే కాదు..ప్రతి ఒక్కరి పెరు బుక్ లో రాసుకుంటాం.
ఎవరైతే చట్టాన్ని అతిక్రమించి మా వాళ్లపై లాఠీ ఛార్జ్ చేశారో ఆ అధికారి సంగతి తప్పకుండా చూస్తాం..
ఇప్పటి వరకు హుందాగా రాజకీయాలు చేసాను కానీ కాంగ్రెస్ పార్టీ నీచ రాజకీయాలు చేస్తుంది వారికి తగిన మూల్యం తప్పదు.