నిజామాబాద్ A9 news
*ఎంపీ అర్వింద్ చొరవతో ఏండ్ల కల సాకారం
* మేడ్చల్ – మూత్కేడ్ రైల్వే డబ్లింగ్ పనులకు మోక్షం
మేడ్చల్ – ముత్ఖేడ్ రైల్వే మార్గంలో డబ్లింగ్ పనులకు భారీగా నిధులు కేటాయించడంతో భాజపా నాయకులు కార్యకర్తలు సంబరాలు చేసారు.
బీజేపీ కంటేశ్వర్ మండల అధ్యక్షులు రోషన్ లాల్ బోరా ఆధ్వర్యంలో ప్రధాని మోదీ , రైల్వే మంత్రి అశ్విని వైష్ణవ్, పార్లమెంట్ సభ్యులు అర్వింద్ చిత్రపటానికి పాలభిషేకం చేశారు .
ఈ సందర్భంగా బీజేపీ సీనియర్ నాయకులు బుస్సాపూర్ శంకర్ హర్షం వ్యక్తం చేసి మాట్లాడుతూ నిజామాబాద్ జిల్లా దక్షిణ మధ్య రైల్వే పరిధిలో ఎప్పుడెప్పుడా అని ఎదురు చూస్తున్న ముదేడ్ -మేడ్చల్ మరియు మహబూబ్నగర్ -డోన్ సెక్షన్ల మధ్య 502.34. కి. మీ లతో 5665.4 కోట్ల అంచనా వ్యయంతో ప్రస్తుతమున్న సింగల్ రైల్వే లైన్ ను ఎంపీ ధర్మపురి అర్వింద్ కృషితో డబుల్ రైల్వే లైనుగా మార్చుటకు కేంద్ర కేబినెట్ ఆమోదం తెలిపిందన్నారు.
మొన్నటికి మొన్న నిజామాబాద్ రైల్వే స్టేషన్ ఆధునీకరణకు 53 కోట్లు కేంద్ర ప్రభుత్వం మంజూరు. చేసిందని, ఇప్పుడు ఉమ్మడి నిజామాబాద్ జిల్లాకు ఎంతగానో ఉపయోగపడే ఈ ప్రాజెక్టు చేపట్టాలని నిజామాబాద్ ఎంపీ ధర్మపురి అర్వింద్ చేసిన విజ్ఞప్తులకు భారీ మొత్తంలో నిధులు మంజూరు చేసిన ప్రధాని మోదీ కి రైల్వే శాఖ మంత్రి అశ్విని వైష్ణవ్ కి ధన్యవాదాలు తెలియజేశారు.
ఇప్పటికే ముద్ ఖేడ్ నుండి బాసర వరకు పట్టాలు వేయుటకు భూమి చదును చేస్తున్నారని , అతి త్వరలోనే డబుల్ లైన్ పనులు ప్రారంభమవు తాయని పేర్కొ న్నారు. డబుల్ రైల్వే మార్గం పూర్తయితే నిజామాబాద్ నుండి ముంబై, పూణే, షిరిడి మరియు నిజామాబాద్ నుండి బెంగళూరు ల మధ్య రైల్వే కనెక్టివిటీ పెరగడమే కాకుండా ప్రయాణ మార్గం. సులభతరం అవుతుందని, అలాగే మూడు నాలుగు గంటల ప్రయాణ. సమయం తగ్గే అవకాశం ఉందన్నారు..
ఎంపీ అర్వింద్ పదవి చేపట్టినప్పటి నుంచి కేంద్రం నుంచి అనేక నిధులు తెచ్చి జిల్లాను అభివృద్ధి చేస్తున్నారు
ఈ కార్యక్రమంలో కార్పోరేట్ ఎర్రం సుధీర్ , ఐటీ వింగ్ పార్లమెంట్ కన్వీనర్ ఈగ ఆశిష్ , నరేష్ గౌడ్ , ప్రసన్న కుమార్ , ప్రవీణ్ , కార్తిక్ తదితరులు పాల్గొన్నారు