ప్రభుత్వం రాష్ట్ర, జిల్లా స్థాయి పోలీసు ఫిర్యాదు ప్రాధికార సంస్థలను పునర్వ్యవస్థీకరించింది. ఈ మేరకు సోమవారం హోం శాఖ ముఖ్య కార్యదర్శి రవి గుప్తా ఉత్తర్వులు జారీ చేశారు.ప్రభుత్వం రాష్ట్ర, జిల్లా స్థాయి పోలీసు ఫిర్యాదు ప్రాధికార సంస్థలను పునర్వ్యవస్థీకరించింది. ఈ మేరకు సోమవారం హోం శాఖ ముఖ్య కార్యదర్శి రవి గుప్తా ఉత్తర్వులు జారీ చేశారు. సుప్రీంకోర్టు ఆదేశాల మేరకు గతంలో ఏర్పాటు చేసిన ఈ ప్రాధికార సంస్థల పదవీకాలం ముగియడంతో ప్రభుత్వం ఈ నిర్ణయం తీసుకుంది. కొత్తగా నియమితులైన సభ్యుల వివరాలను ప్రభుత్వం వెల్లడించింది. ఈ నియామకాలకు సంబంధించిన ఇతర నిబంధనలు గతంలో జారీ చేసిన జీవో నెంబర్ 44 లో పేర్కొన్న విధంగానే ఉంటాయని ప్రభుత్వం పేర్కొంది.
రాష్ట్ర పోలీసు ఫిర్యాదు ప్రాధికార సంస్థ చైర్మన్‌గా జస్టిస్ శివ శంకర్ రావు (రిటైర్డ్ న్యాయమూర్తి, ఆంధ్రప్రదేశ్ హైకోర్టు), సభ్యులుగా పి.ప్రమోద్ కుమార్ (రిటైర్డ్ ఐపీఎస్), వర్రె వెంకటేశ్వర్లు (న్యాయవాది, మాజీ సమాచార కమిషన్ సభ్యుడు), సభ్య కార్యదర్శిగా అదనపు డీజీపీ (లా అండ్ ఆర్డర్) వ్యవహరించనున్నారు. అలాగే.. హైదరాబాద్ జిల్లా ఫిర్యాదు ప్రాధికార సంస్థ చైర్‌పర్సన్‌గా కె.సుదర్శన్ (రిటైర్డ్ జిల్లా జడ్జి), సభ్యులుగా పి.రామమోహన్ (మాజీ జర్నలిస్ట్), రామనరసింహారెడ్డి (రిటైర్డ్ అడిషనల్ ఎస్పీ), సభ్య కార్యదర్శిగా ఐజీపీ (మల్టీ జోన్-II) ఉంటారు. వరంగల్ జిల్లా పోలీసు ఫిర్యాదు ప్రాధికార సంస్థ చైర్‌పర్సన్‌గా వై.అరవింద్ రెడ్డి (రిటైర్డ్ జిల్లా జడ్జి), సభ్యులుగా ఎం.నారాయణ (రిటైర్డ్ ఐపీఎస్), డాక్టర్ సమల రాజేందర్, సభ్య కార్యదర్శిగా ఐజీపీ (మల్టీ జోన్-I) వ్యవహరించనున్నార.