నిజామాబాద్ A9 news
భారతీయ జనతా పార్టి ఆర్మూర్ పట్టణ శాఖ అధ్యక్షులు ద్యాగ ఉదయ్ ఆధ్వర్యంలో ఆర్మూర్ మున్సిపాలిటీ పరిధిలోని మామిడిపల్లి లో ఉన్న బిజెపి రాష్ట్ర కార్యవర్గ సభ్యులు పెద్దోళ్ల గంగారెడ్డి గృహమునందు 77 సంవత్సరాల స్వతంత్ర దినోత్సవాన్ని పురస్కరించుకొని ఆర్మీ అధికారులుగా పదవీ విరమణ చేసినటువంటి గుజరాతి లక్ష్మీనారాయణ, బొమ్మెన రాజేందర్, సాత్పుతే గిర్మాజి నూతన్, బడుగు స్వామి జవాన్లను శాలువాలతో ఘనంగా సత్కరించడమైనది.
ఈ కార్యక్రమంలో బిజెపి రాష్ట్ర కార్యవర్గ సభ్యులు పెద్దోళ్ల గంగారెడ్డి, బిజెపి జిల్లా అధికార ప్రతినిధి జెస్సు అనిల్ కుమార్, కిసాన్ మోర్చా జిల్లా అధ్యక్షులు నూతుల శ్రీనివాస్ రెడ్డి, బిజెపి ఆర్మూర్ అసెంబ్లీ కన్వీనర్ పాలెపు రాజు, బిజెపి జిల్లా కార్యవర్గ సభ్యులు పోల్కం వేణు, బీజేవైఎం ఆర్మూర్ పట్టణ అధ్యక్షులు కలిగోట ప్రశాంత్ తదితరులు పాల్గొన్నారు.