Monday, November 25, 2024

జీవన్ రెడ్డి గెలుపు కోసం కృషి చేస్తున్న వినయ్ రెడ్డి

spot_img
- Advertisement -spot_imgspot_img
- Advertisement -spot_imgspot_img

నిజామాబాద్ A9 news

*పొద్దుటూరి వినయ్ రెడ్డి బిజెపి లోకి రావడం బీజేపీ నుండి వెళ్లడం పూర్తిగా ఆర్మూర్ ఎమ్మెల్యే జీవన్ రెడ్డి డైరెక్షన్లో ఎమ్మెల్యే జీవన్ రెడ్డి విజయానికి మార్గంలో భాగమే

*ఆర్మూర్ బిజెపి నేతల ఆరోపణ

నిన్నటి రోజు పొద్దుటూరి వినయ్ కుమార్ రెడ్డి బిజెపి ప్రాథమిక సభ్యత్వానికి రాజీనామా చేస్తూ బీజేపీ రాష్ట్ర అధ్యక్షులు కిషన్ రెడ్డికి ఉత్తరం రాసి సోషల్ మీడియాలో పెట్టడాన్ని సంబంధించి పాత్రికేయ సమావేశం నిర్వహించిన జిల్లా అధికార ప్రతినిధి జెస్సు అనిల్ కుమార్, కిసాన్ మోర్చా జిల్లా అధ్యక్షులు నూతుల శ్రీనివాస్ రెడ్డి, బిజెపి ఆర్మూర్ అసెంబ్లీ కన్వీనర్ పాలెపు రాజు మాట్లాడుతూ….

 

వినయ్ రెడ్డి రాసిన ఉత్తరంలో తాను 2016లో క్రియాశీలక రాజకీయాల్లోకి వచ్చి 2018లో ఎన్నికల ముందు భారతీయ జనతా పార్టీలో చేరి బిజెపి నుండి టికెట్ తీసుకుని ఎమ్మెల్యేగా పోటీ చేయడం జరిగిందని. తనకు ఎప్పుడు రాని విధంగా దాదాపు 20వేల ఓట్లు వచ్చాయని, అరవింద్ ఎంపీగా గెలవడానికి అధిక ఓట్లను నేనే తెప్పించానని అహంకారంతో, తానే బిజెపిగా భావిస్తూ రాసినటువంటి పద్ధతి సరైంది కాదని. భారతీయ జనతా పార్టీ సిద్ధాంతం ప్రకారం నడిచే పార్టీ.

ఈ పార్టీ కోసం నిరంతరంగా ఎందరో వ్యక్తులు పని చేస్తా ఉంటారని. ఈ పార్టీలో ఇప్పటికి ఎప్పటినుంచో పని చేస్తున్నటువంటి లోక భూపతి రెడ్డి, పల్లె గంగారెడ్డి, అల్లాపూర్ శ్రీనివాస్, పెద్దోళ్ల గంగారెడ్డి,బద్దం లింగారెడ్డి, పుప్పాల శివరాజ్ లాంటి ఎందరో వ్యక్తుల త్యాగ ఫలితమే ఎమ్మెల్యే ఎన్నికల సమయంలో కానివ్వండి, ఎంపీ ఎన్నికల సమయంలో కానివ్వండి వచ్చిన ఓట్లే తప్ప ఒక్క వినయ్ రెడ్డి కారణంగా వచ్చినటువంటి ఓట్లు కాదని. తాను మాత్రం తనే తెచ్చాడు అని చెప్పినప్పటికిని భారతీయ జనతా పార్టీ తన కుటుంబ వ్యక్తిగా భావించి తనను ఏమీ అనకుండా ఉండడం జరిగిందని. కాని తాను మాత్రం తానే పార్టీగా భావించి కార్యకర్తలకు అన్ని రకాలుగా మాయ మాటలు చెబుతూ పార్టీని చీల్చే ప్రయత్నం చేయడం జరిగిందని.

తాను బీజేపీ లోకి రావడం కూడా జీవన్ రెడ్డిని గెలిపించుకోవడానికే తప్ప తాను బిజెపి ఎమ్మెల్యే గా గెలవడానికి కాదని, తాను బిజెపిలో చేరినప్పటి నుండి రాజీనామా చేసే సమయం వరకు కూడా ఏ రోజు కూడా తాను ఎమ్మెల్యే జీవన్ రెడ్డిని కానీ, బిఆర్ఎస్ ను కానీ విమర్శించినటువంటి దాఖలాలు లేవని. ఈరోజు తాను రాజీనామా చేసి బయటకు వెళ్లడం వెనుక మళ్లీ జీవన్ రెడ్డి ఉన్నాడని. నిజామాబాద్ పార్లమెంట్ సభ్యులు ధర్మపురి అరవింద్ నిజామాబాద్ పార్లమెంట్లో చేస్తున్నటువంటి అభివృద్ధి, కార్యకర్తల నిర్మాణం, ఓ కట్టర్ హిందుత్వ వాదిగా మారి తన కృషి కారణంగా నిజామాబాద్ పార్లమెంట్లో ఉన్నటువంటి ఏడుగురు ఎమ్మెల్యేలను గెలిపించుకునే స్థాయికి ఎదగడాన్ని జీర్ణించుకోలేనటువంటి జీవన్ రెడ్డి, వినయ్ రెడ్డి అనే ఆయుధాన్ని ఉపయోగించి వినయ్ రెడ్డి బిజెపిలో ఉంటే గెలుస్తాడు కాబట్టి వెంటనే పార్టీ మారమని జీవన్ రెడ్డి ఆదేశాలు ఇవ్వడంతో వినయ్ రెడ్డి పార్టీ మారడం జరిగిందని.

బిజెపిలో ఉన్నటువంటి నాయకులను, కార్యకర్తలను మాయమాటలు చెప్పి తన వైపు లాక్కుంటే మళ్ళీ జీవన్ రెడ్డి ఎమ్మెల్యే అవుతాడని ఓ ప్రణాళికతో వినయ్ రెడ్డి బయటికి వెళ్లడం జరిగిందే తప్ప నిజంగా ఎమ్మెల్యే జీవన్ రెడ్డిని ఓటమి పాలు చేయాలనే లక్ష్యం ఉంటే తాను బిజెపిలోనే ఉండి ఎవరు ఎమ్మెల్యే టికెట్ పొందిన వారికి మద్దతు తెలియజేసి జీవన్ రెడ్డిని ఓడించేవాడని. కానీ జీవన్ రెడ్డి ఓడిపోవడం తనకు ఇష్టం లేదు కావుననే బిజెపి పార్టీ నుండి వెళ్లడం జరిగిందని.

అంతేకాకుండా బిజెపిలో బాధ్యతలు మూడు సంవత్సరాలకొకసారి మారుతా ఉంటాయని. మూడు సంవత్సరాల తర్వాత బాధ్యతలను మార్చుట బిజెపిలో సహజమని, బిజెపి నాయకులు చెప్పకుండా మండల అధ్యక్షులను మార్చారు అనడం సబబు కాదని. నూతనంగా మండలాలు ఏర్పడడం కారణంగా నూతన మండల అధ్యక్షులను నియామకం చేయడం జరిగిందని, అదేవిధంగా మూడు సంవత్సరాలు పూర్తి చేసుకున్నటువంటి మండల అధ్యక్షులను, పట్టణ అధ్యక్షులను మార్చి నూతన అధ్యక్షులను నియామకం చేయడం జరిగిందని. అంతేగాని చెప్పకుండా తీసేసారని చెప్పడం బిజెపి సిద్ధాంతం పై మీకు ఉన్న అవగాహన

తేటాతెల్లమైపోయిందని. బిజెపి మిమ్మల్ని గౌరవించి కొత్తగా వచ్చినప్పటికిని 2018 లో ఎమ్మెల్యే టికెట్ ను ఇవ్వడమే కాకుండా

2023లో బీజేపీ రాష్ట్ర కార్యవర్గ సభ్యులుగా నియమించిందని. కానీ మీరు బిజెపి కి చేసిందేమిటో ఆత్మ పరిశీలన చేసుకోవాలని. ప్రజలు ప్రతి విషయాన్ని గమనిస్తున్నారని, బిజెపి కార్యకర్తలను, నాయకులను మాయమాటలతో ఇబ్బంది పెడితే ప్రజలే సరైన గుణపాఠం నేర్పుతారని, ఈ సందర్భంగా హెచ్చరించడమైనది.

+ posts
- Advertisement -spot_imgspot_img
Latest news
spot_img
- Advertisement -spot_img
Related news
- Advertisement -spot_img

LEAVE A REPLY

Please enter your comment!
Please enter your name here