Apr 11, 2025,
తెలంగాణలోని ప్రైవేట్ పాఠశాలల్లో విద్యాహక్కు చట్టం అమలు చేయాలని సామాజిక కార్యకర్త తాండవ యోగేష్ హైకోర్టులో పిల్ దాఖలు చేశారు. విద్యాహక్కు చట్టం అమల్లోకి వచ్చి 16ఏళ్లు కావస్తున్న రాష్ట్రంలోని విద్యార్థులకు అందుబాటులోకి రాలేదని పిటిషనర్ ఆవేదన వ్యక్తం చేశారు. శుక్రవారం వాదనలు విన్న హైకోర్టు.. తదుపరి విచారణను 21వ తేదీకి వాయిదా వేసింది.