A9 news, : ఆలూర్ మండలంలోని దేగాం గ్రామం సుస్థిర గ్రామీణాభివృద్ధికి ఆదర్శంగా నిలిచింది. ఈ మేరకు 2022–23 సంవత్సరానికిగాను గ్రామంలో పలు అభివృద్ధి పనులు విజయవంతంగా అమలు చేయడంతో కేంద్ర ప్రభుత్వం అందించే 19వ రాష్ట్రస్థాయి అవార్డును సొంతం చేసుకుంది.ఈ సందర్భంగా ఎంపీడీవో గంగాధర్(MPDO Gangadhar) మాట్లాడుతూ.. దేగాం గ్రామం శుభ్రత, పర్యావరణ పరిరక్షణ, మౌలిక సదుపాయాల అభివృద్ధి, మహిళా సాధికారత, జల వ్యవస్థాపన వంటి రంగాల్లో అత్యుత్తమ ప్రదర్శన కనబర్చిందన్నారు. దీంతో దేగాం గ్రామ కార్యదర్శి శ్రీనివాస్‌ను శాలువాతో సత్కరించారు. కార్యక్రమంలో కార్యదర్శులు రాజలింగం, దినేష్, నవీన్, నసీర్, కిషోర్, తదితరులు పాల్గొన్నారు.