గ్రామాల్లో బడుగు జనాలకు రక్షణ కల్పించాలి.
సానుకూలంగా స్పందించిన పోలీస్ కమిషనర్ గారికి కృతజ్ఞత.
తెలంగాణ BC , SC , ST , మైనారిటీ సంక్షేమ వేదిక రాష్ట్ర అధ్యక్షుడు బుస్సాపూర్ శంకర్.
నిజామాబాద్ : గతంలో గ్రామాభివృద్ధి కోసం ఏర్పడిన కమిటీలు , ఇప్పుడు చట్ట విరుద్ధంగా వ్యవహరిస్తూ ప్రజలను బెదిరించడం, డబ్బులు వసూలు చేయడం వంటి కార్యకలాపాల్లో
సివిల్, భూ , కుటుంబ తగాదాలను తాము పంచాయితీల పేరుతో పరిష్కరించేందుకు పాల్పడుతున్నారని తెలంగాణ BC SC ST సంక్షేమ వేదిక రాష్ట్ర అధ్యక్షుడు బుస్సాపూర్ శంకర్ అన్నారు.
ఈ సందర్భంగా జిల్లా పోలీసు కమిషనర్ సాయి చైతన్య గారితో భేటి అయిన ఆయన మాట్లాడుతూ , VDC ల అరాచకం గురించి కమిషనర్ గారితో చాలా సేపు చర్చించడం జరిగిందన్నారు.
గ్రామాభివృద్ధి కమిటీ (VDC)లు చట్టాన్ని చేతుల్లోకి తీసుకోవడం మంచి పరిణామం కాదని , ఎవరైనా మాట వినకపోతే బహిష్కరణలతో భయబ్రాంతులకు చేయడం సరైన పద్ధతి కాదన్నారు.
భారతదేశం లో ప్రతి ఒక్కరూ చట్టాల ప్రకారమే జీవించాలని , ఎవరికైనా సమస్యలుంటే సంబంధిత అధికార శాఖలను సంప్రదించాలి అంతే కానీ గ్రామాభివృద్ధి కమిటీలు చట్టస్థానాన్ని భ్రమింపచేసే ప్రయత్నం చేయకూడదన్నారు.
ఇకపై ఇలాంటి చర్యలు, బహిష్కరణలు జరిపిన పక్షంలో చట్టపరమైన కఠిన చర్యలు తీసుకుంటామని , ఎవ్వరినీ ఉపేక్షించము అని నిన్న పోలీస్ కమిషనర్ సాయి చైతన్య గారు ప్రకటించడం అభినందనియం అని అన్నారు.
పోలీస్ వారు VDC ల నుంచి సామాన్య ప్రజలకు రక్షణ కల్పించాలని , గ్రామాల్లో బడుగు జనం స్వేచ్ఛగా తమ తమ వృత్తులు చేసుకొనే పరిస్థితులు తేవలన్నారు.
ఈ సందర్భంగా ఆయన తో పాటు నిజామాబాద్ నగర అధ్యక్షులు చంద్రకాంత్ , రాష్ట్ర నాయకులు చండాలియ నరేందర్ తదితరులు పాల్గొన్నారు.