హైదరాబాద్, ఏప్రిల్ 10: హైదరాబాద్‌కు భారీ వర్ష సూచన ఉందని వాతావరణ శాఖ హెచ్చరించింది. మరో గంటలో నగర వ్యాప్తంగా భారీగా వర్షం పడనున్నట్లు వాతావరణ శాఖ తెలిపింది. రాత్రి వరకు కూడా వర్షం కురిసే అవకాశం ఉంది. భారీ వర్ష సూచన నేపథ్యంలో జీహెచ్‌ఎంసీని హైదరాబాద్ వాతావరణ శాఖ అప్రమత్తం చేసింది. అలాగే తెలంగాణతో పాటు ఏపీలో కూడా ఈరోజు, రేపు కూడా ఉరుములు, మెరుపులతో కూడిన వర్షం కురిసే అవకాశం ఉంది..