హైదరాబాద్:ఏప్రిల్ 09

కులాలు,మతాల మధ్య ప్రధాని మోడీ చిచ్చుపెడు తున్నారని, గాంధీ విధానాలకు వ్యతిరేకంగా పని చేస్తున్నారంటూ అహ్మదాబాద్, వేదికగా జరుగుతున్న ఏఐసీసీ ప్లీనరీ సమావేశంలో తెలంగాణ ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి,ఆగ్రహం వ్యక్తం చేశారు.

గాడ్సే సిద్ధాంతాన్ని మోడీ ప్రోత్సహిస్తున్నారని దేశాన్ని విభజించాలని క‌మ‌ల‌ నాధులు చూస్తున్నారని, ఎట్టి పరిస్థితుల్లోనూ తెలంగాణలో బిజెపిని అడుగుపెట్టనీయబోమని రేవంత్ రెడ్డి వ్యాఖ్యానిం చారు .

తెలంగాణలో కులగణన చేసి రాహుల్‌ గాంధీ కి ఇచ్చిన మాట నిలబెట్టు కున్నట్లు తెలిపారు. అధికా రంలోకి వచ్చిన అనతి కాలంలోనే రైతులకు రుణమాఫీ చేసినట్లు చెప్పారు. మోడీ, బీజేపీ నేతలు గాడ్సే సిద్ధాంతాన్ని ప్రోత్సహిస్తున్నారని సంచలన వ్యాఖ్యలు చేశారు.

అహ్మదాబాద్ లో జ‌రుగుతున్న ఎఐసిసి స‌మావేశాల రెండో రోజైన నేడు రేవంత్ మాట్లాడు తూ..దేశంలో కుల గణన చేపట్టిన తొలి రాష్ట్రం తెలంగాణే అని గర్వంగా తెలిపారు. రాష్ట్రంలోని కుల గణనను తాము విజయవంతంగా పూర్తి చేశామని, అదే తరహాలో దేశవ్యాప్తంగా కూడా జనాభా గణనతో పాటు కుల గణన జరగాల్సిన అవసరం ఉందన్నారు.

తెలంగాణలో కాంగ్రెస్ పార్టీ అధికారంలోకి వచ్చిన వెంటనే రాహుల్ గాంధీ ఇచ్చిన హామీ ప్రకారం 21 వేల కోట్ల వ్యవసాయ రుణాలను మాఫీ చేశామని వెల్లడించారు. రైతులపై భారం తగ్గించేందుకు ప్రభు త్వం చేపట్టిన ఈ నిర్ణయం ఎంతో ఉపయోగపడుతుం దని చెప్పారు.

పార్లమెంట్‌లో రాహుల్ గాంధీకి మైక్ ఇవ్వకపోవడం దురదృష్టకరమన్నారు. ప్రజల గొంతుక అయిన ప్రతిపక్ష నాయకుడికి మాట్లాడేందుకు కూడా అవకాశం ఇవ్వకపోవడం ప్రజాస్వామ్యానికి హానిక రమని విమర్శించారు.

ప్రధానమంత్రి నరేంద్ర మోడీ రెండు కోట్ల ఉద్యోగాలు ఇస్తానని చెప్పారని, కానీ వాస్తవంగా దేశ యువత నిరుద్యోగంతో తల్లడిల్లు తుందని వ్యాఖ్యానించారు. ఆయన పాలనలో దేశానికి అభివృద్ధి కన్నా మోసం ఎక్కువగా జరిగిందని ఆరోపించారు.

రాహుల్ గాంధీతో కలిసి గాంధీ పరివారమంతా పనిచేయాలని రేవంత్ పిలుపునిచ్చారు. ప్రజాస్వా మ్యం, సమానత్వం, నైతికత కోసం పోరాడే నాయకుడిగా రాహుల్ గాంధీని ఆదరించాలని కోరారు. కాగా మోడీ పరివారాన్ని గాడ్సే పరివారంగా అభివర్ణించి తీవ్ర విమర్శలు చేశారు.

By Admin

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *