*స్వాగత ఏర్పాట్ల పరిశీలనలో పర్యాటకశాఖ కార్యదర్శి స్మిత సబర్వాల్.

హైదరాబాద్:ఏప్రిల్ 09

తెలంగాణ అతిథ్యానికి వన్నె తెచ్చేలా మిస్ వరల్డ్ పోటీలు ఉండాలని తెలంగాణ పర్యాటక శాఖ కార్యదర్శి స్మిత సబర్వాల్ అధికారులకు దిశనిర్దేశం చేశారు. పోటీల్లో పాల్గొనే రూప దర్శినులకు నగరం లో స్వాగతం ఏర్పాట్లు పై మంగళవారం సాయంత్రం చార్మినార్ సమీప చౌమోహల్లా ప్యాలెస్ లో సమీక్ష నిర్వహించారు.

వ‌చ్చే నెల మే 7 నుంచి 31 వరకు 72వ మిస్ వరల్డ్ పోటీలు తెలంగాణ టూరిజం ఆధ్వర్యంలో జరగనున్నాయి,ఈ పోటీల్లో 120 దేశాలకు చెందిన మోడల్స్ పాల్గొంటారు. వారు మే 6, 7న హైదరా బాద్ కు చేరుకుంటారు.

దీంతో వారి రాక సందర్భం గా చార్మినార్ వద్ద హెరిటేజ్ వాక్, చౌమొహల్లా ప్యాలెస్ లో వెల్కమ్ డిన్నర్ ఉంటుం ది. వీటి ఏర్పాట్ల కోసం టూరిజం, జీహెచ్ఎంసీ, హెరిటేజ్, పోలీస్ ఆఫీసర్ల తో ప్యాలెస్ లో క్షేత్రస్థా యిలో పర్యటించారు.

వెల్కమ్ డిన్నర్ లో తెలంగాణ టూరిజం బ్రాండ్ ఇమేజ్ అనుగుణంగా ఏర్పాట్లను చేయాలని స్మితా సభర్వాల్ అధికా రులకు సూచించారు. 120 మంది మోడల్స్ తో పాటు సుమారు 400 మంది ప్రతినిధులు, ఫోటోగ్రాఫర్లు, అంతర్జాతీయ మీడియా ప్రతినిధులు పాల్గొంటారు.

ఈవెంట్ ప్రారంభం నుంచి చివరి వరకు పర్యాటక ప్రత్యేకతలు చాటేలా కార్యక్రమాలు రూపొందిం చేలా ఏర్పాట్లు చేయాలని అధికారులను ఆదేశించా రు.

ప్యాలెస్ లో ఫోటోషూ ట్ కోసం సీటింగ్ ఏర్పాట్లు, లైవ్ మ్యూజిక్ కాంటెస్ట్, సూఫీ మ్యూజిక్, కవ్వాలీ సంగీత ప్రదర్శన, తెలంగా ణ సాంస్కృతి, సాంప్రదా యాలు ఉట్టిపడేలా 20 నిమిషాలు పాటు సాంస్కృ తిక కార్యక్రమాలు నిర్వహిం చేలా కార్యక్రమాన్ని రూపొం దించాలని, సూచించారు.

By Admin

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *