A9 న్యూస్ ప్రతినిధి ఆర్మూర్:
ఆర్మూర్ పట్టణంలో శ్రీరామనవమి సందర్భంగా సీతారాముల కల్యాణం అంగరంగ వైభవంగా జరిగింది. భారీగా తరలివచ్చిన భక్తజనం, అర్చకులు సీతారాముల కల్యాణం జరిపించారు. ఆర్మూర్ సిద్దుల గుట్ట ఆలయంలో ఏర్పాటు చేసిన కల్యాణ మండపంలో సీతారాముల విగ్రహాలను అందంగా ముస్తాబు చేసి.. రాములవారితో సీత మెడలో తాళి కట్టించారు. ఈ కార్యక్రమంలో పాల్గొన్నారు.
ఆర్మూర్ నియోజకవర్గ కాంగ్రెస్ ఇంచార్జ్ పొద్దుటూరు వినయ్ కుమార్ రెడ్డి మాట్లాడుతూ…. హిందూ మత విశ్వాసాల ప్రకారం దశరథుడు, కౌసల్య దంపతులకు శ్రీ రాముడు జన్మించాడనీ, త్రేతాయుగంలో ఛైత్ర శుద్ధ నవమి రోజున, వసంత బుుతువు కాలంలో, పునర్వసు నక్షత్రం కర్కాటక లగ్నంలో మధ్యాహ్నం 12 గంటలకు పుట్టాడనీ, అందుకే ఈ పవిత్రమైన రోజున ప్రతి సంవత్సరం మన దేశంలో శ్రీరామ నవమి వేడుకలను జరుపుకుంటారనీ అన్నారు.
రామ’ అనే రెండక్షరాలను జపించడం వల్ల మనలో ఏకాగ్రత పెరిగి ఆధ్యాత్మిక రంగంపై ఆసక్తి పెరిగేలా చేస్తుందనీ, అంతే కాదు ఈ ఒక్క నామంతో దుష్ఫలితాలను పోగొట్టుకోవచ్చనీ, ఈ మంత్రాలను పఠించడానికి ముందు ఆ భగవంతుని ఫోటో లేదా విగ్రహం ముందు దీపం వెలిగించాలనీ, ఇలా చేయడం వల్ల శుభ ఫలితాలొస్తాయని పండితులు చెబుతారనీ అన్నారు. శ్రీరామ నవమి వంటి పవిత్రమైన రోజున రామాలయంలో పసుపు రంగు వస్త్రాలను సమర్పించాలనీ, పురాణాల ప్రకారం, రాముడు పసుపు రంగు వస్త్రాలను ఇష్టపడతారనీ ఇలా చేయడం వల్ల శ్రీరాముడు సంతోషిస్తారు. దీంతో మీ ఇంట్లో ఆనందం పెరుగుతుందనీ అన్నారు. ఈ కార్యక్రమంలో ఏఎంసీ చైర్మన్ సాయిబాబా గౌడ్, మాజీ మున్సిపల్ చైర్మన్ లు అయ్యప్ప శ్రీనివాస్, పండిత్ పవన్, కౌన్సిలర్లు, కాంగ్రెస్ పార్టీ సీనియర్ నాయకులు, సిద్దలగుట్ట ఆలయ కమిటీ సభ్యులు పాల్గొన్నారు.