A9 న్యూస్ ప్రతినిధి ఆర్మూర్:
ఆర్మూర్ పట్టణంలోని ప్రసిద్ధిగాంచిన నవనాథ సిద్దుల గుట్టపై శ్రీరామనవమి సందర్భంగా సీతారాముల కల్యాణ మహోత్సవంలో సతి సమేతంగా పాల్గొన్న టిపిసిసి అధ్యక్షులు మహేష్ కుమార్ గౌడ్, ఆర్మూర్ నియోజకవర్గ కాంగ్రెస్ పార్టీ ఇన్చార్జి ప్రొద్దుటూరు వినయ్ కుమార్ రెడ్డిలు గుట్టపై ఉన్న శివాలయం, రామాలయం, అయ్యప్ప ఆలయాలను సందర్శించి పూజలు నిర్వహించారు. ఆలయ కమిటీ మహేష్ కుమార్ గౌడ్ కి ఘన స్వాగతం పలికారు.
మీడియాతో మాట్లాడుతూ నిజామాబాద్ జిల్లాలోని ప్రసిద్ధిగాంచిన పుణ్యక్షేత్రం నవనాథ సిద్దిలగుట్ట ఇంతటి పుణ్యక్షేత్రానికి పర్యాటకశాఖ గుర్తించి నిజామాబాద్ జిల్లాలోని మూడు దేవాలయాలను గుర్తించడం జరిగింది. రానున్న రోజులలో పర్యాటక శాఖ నుండి మరియు ప్రభుత్వం ద్వారా రానున్న రోజులలో ఈ దేవాలయాన్ని అభివృద్ధి చేస్తామని చెప్పడం జరిగింది.
ఈ కార్యక్రమంలో ఆర్మూర్ పట్టణ కాంగ్రెస్ పార్టీ అధ్యక్షులు ఏఎంసీ చైర్మన్ సాయిబాబా గౌడ్, మాజీ మున్సిపల్ చైర్మన్ లు అయ్యప్ప శ్రీనివాస్, పండిత్ పవన్, కౌన్సిలర్లు రవి గౌడ్, మురళి, కాంగ్రెస్ పార్టీ సీనియర్ నాయకులు సాయినాథ్ గౌడ్, సిద్దలగుట్ట ఆలయ కమిటీ సభ్యులు, కాంగ్రెస్ పార్టీ నాయకులు కార్యకర్తలు పాల్గొన్నారు.