*ఢిల్లీలో జంతర్ మంతర్ వద్ద పోరాటం*
తెలంగాణ అసెంబ్లీ ఆమోదించిన బీసీలకు విద్యా, ఉద్యోగ రాజకీయ రంగాలలో 42 శాతం రిజర్వేషన్ల బిల్లును పార్లమెంట్ లో ప్రవేశపెట్టి చట్టబద్ధత కల్పించాలని కేంద్రంలో ఉన్న బిజెపి ప్రభుత్వానికి షాద్ నగర్ ఎమ్మెల్యే వీర్లపల్లి శంకర్ కోరారు.
ఢిల్లీలో జరిగిన ఆందోళన కార్యక్రమానికి ఎమ్మెల్యే శంకర్ హాజరయ్యారు ఈ సందర్భంగా ఆయన మాట్లాడుతూ.. ఈ బిల్లు ద్వారా బీసీ ఉప కులాలలో ఉన్న అన్ని వర్గాలకు మరింత మెరుగ్గా ప్రభుత్వ సంక్షేమ ఫలాలను అందించవచ్చని తెలిపారు. బీసీ కుల గణన కాంగ్రెస్ ప్రభుత్వం తీసుకున్న ఒక సాహసోపేత నిర్ణయమని పేర్కొన్నారు. ఈ బిల్లు కు అన్ని పార్టీలు మద్దతు ఇచ్చి బిల్లు ఆమోదానికి కృషిచేయాలని కోరారు. ఈ కార్యక్రమంలో తెలంగాణ మంత్రి పొన్నం ప్రభాకర్,కొండ సురేఖ, పీసీసీ అధ్యక్షులు మహేష్ కుమార్ గౌడ్,బీసీ ఎమ్మెల్యేలు, బీసీ మేధావులు,బీసీ నాయకులు తదితరులు పాల్గొన్నారు..