సిద్ధిపేట జిల్లాలో దారుణం జరిగింది. పోలీస్‌నని బెదిరించి ఓ ఆగంతకుడు మైనర్ బాలికపై అత్యాచారానికి పాల్పడ్డాడు. వివరాల్లోకి వెళితే.. సంగారెడ్డి జిల్లా హత్నూర్ మండలంలోని ఓ గ్రామానికి చెందిన ఇంటర్ విద్యార్ధిని కాలేజ్ ముగిసిన తర్వాత తెలిసిన యువకుడితో కలిసి జగదేవపూర్ వద్దకు చేరుకుంది.
నిర్మానుష్య ప్రదేశంలో ఇద్దరూ ఏకాంతంగా మాట్లాడుతూ వుండగా.. వారిద్దరిని గమనించిన ఓ అగంతకుడు అక్కడికి వచ్చాడు. తాను పోలీస్‌నని చెప్పడంతో భయపడ్డ యువకుడు అక్కడి నుంచి పారిపోయాడు.
ఆ వెంటనే బాలికను బలవంతంగా బైక్‌పై ఎక్కించుకుని దగ్గరలోని ఓ ప్రైవేట్ వెంచర్‌లో అఘాయిత్యానికి పాల్పడ్డాడు. అనంతరం ఆమెను రాజీవ్ రహదారిపై వదిలేసి పారిపోయాడు. అతికష్టం మీద బాధితురాలు జగదేవ్ పూర్ పోలీసులకు ఫిర్యాదు చేసింది. కేసు నమోదు చేసుకున్న పోలీసులు .. సీసీటీవీ ఫుటేజ్ ద్వారా నిందితుడిని గుర్తించేందుకు ప్రయత్నిస్తున్నారు. ఈ ఘటన స్థానికంగా సంచలనం సృష్టించింది. దీనికి సంబంధించిన మరిన్ని వివరాలు తెలియాల్సి వుంది