జింక మాంసం విక్రయిస్తున్న ముఠా అరెస్టు

 

 

హైదరాబాద్ :ప్రతినిధి

 

శంషాబాద్:ఆగస్టు 14
గుట్టుచప్పుడు కాకుండా అక్రమంగా జింక, దుప్పి మాంసం విక్రయిస్తూ ఎస్ఓటి పోలీసులకు పట్టుపట్ట ఘటన ఆర్జీఐఏ పోలీస్ స్టేషన్ పరిధిలోని గగన్ పహాడ్‌లో చోటుచేసుకుంది.

ఎస్ఓటి ఇన్స్‌పెక్టర్ సత్యనారాయణ గౌడ్ తెలిపిన వివరాల ప్రకారం అక్రమంగా గగన్ పహాడ్‌లో జింక, దుప్పి మాంసం విక్రయిస్తున్నారని పక్కా సమాచారం రావడంతో సోమవారం తెల్లవారుజామున దాడులు నిర్వహించారు.

జింక,దుప్పి మాంసం విక్రయిస్తున్న రంగారెడ్డి జిల్లా కందుకూరు మండలం సరస్వతిపురం గ్రామానికి చెందిన వెంకటేష్, కందుకూరు మండలం లేమూరు చెందిన కరుణాకర్‌తో పాటు నల్గొండ జిల్లా మర్రిగూడ మండలం ఏరుగుపల్లి గ్రామానికి చెందిన శ్రీను లను అదుపులో తీసుకున్నారు.

వారి వద్ద నుండి 16 కేజీల జింక, దుప్పి మాంసం స్వాధీనం చేసుకొని ఒక (TS 05 FN 8258) యాక్టివా, ఒక (AP 29 BL 1407) హోండా షైన్ బైక్ ను సీజ్ చేసి ఆర్జీఐఏ పోలీసులకు అప్పగించినట్లు తెలిపారు. ఆర్జీఐఏ పోలీసులు ముగ్గురు నిందితులను అరెస్టు చేసి కేసు నమోదు చేసి విచారిస్తున్నారు…

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *