A9 న్యూస్ ప్రతినిధి ఆర్మూర్:
ఆర్మూర్ పట్టణంలో శుక్రవారం 10వ తరగతి పరీక్షలు ప్రారంభమైన విషయం తెలిసిందే. ఈ సందర్భంగా ఆర్మూర్ పట్టణంలోని పలు పరీక్ష కేంద్రాలను నిజామాబాద్ జిల్లా కలెక్టర్ రాజీవ్ గాంధీ హనుమంతు తనిఖీ చేశారు. విద్యార్థులకు కల్పించిన సౌకర్యాలను పరిశీలించారు. పకడ్బందీగా పరీక్షలు నిర్వహించాలని అధికారులకు, సిబ్బందికి సూచించారు. ఆయన వెంట ఆర్మూర్ ఆర్డీవో రాజా గౌడ్, తదితరులు ఉన్నారు.