A9 న్యూస్ ప్రతినిధి:
సిపిఎం పార్టీ మరియు ప్రజా సంఘాల నాయకుల అక్రమ అరెస్టులకు ఖండన సిపిఎం జిల్లా కార్యదర్శి రమేష్ బాబ
అర్ధరాత్రి నుండి సిపిఎం పార్టీ కార్యకర్తలను ప్రజాసంఘాల నాయకులను అక్రమంగా అరెస్టులు చేసి నిర్బంధించటం ఏ రకంగా ప్రజాస్వామ్య పాలన అవుతుందని కాంగ్రెస్ పార్టీ నాయకులు చెప్పే ప్రజాస్వామ్య పాలన ఇదేనా అని సిపిఎం జిల్లా కార్యదర్శి రమేష్ బాబు ప్రశ్నించారు. అర్ధరాత్రిలో పార్టీ మరియు ప్రజా సంఘాల నాయకులను అరెస్టులు చేసే వివిధ ప్రాంతాల్లో పోలీస్ స్టేషన్లో నిర్భందించారని వారు తెలిపారు, పార్టీ జిల్లా కార్యదర్శి అయిన తనను మరియు జిల్లా ప్రధాన కార్యదర్శి నూర్జనులను పోలీసుల చేత గృహనిర్బంధంలో బంధించారని వ్యవసాయ కార్మిక సంఘం జిల్లా ప్రధాన కార్యదర్శి పెద్ద వెంకటరాములను ఐదవ టోన్ పోలీస్ స్టేషన్లో నిర్భందించారని సిఐటియు శంకర్ గౌడ్ ను బోధన్ పోలీస్ స్టేషన్లో నిర్భందించారని విధంగా సిఐటియు నాయకులు ఈవీఎల్ నారాయణ. కటారి రాములను నాలుగో టౌన్ పోలీస్ స్టేషన్లో. శ్రీనివాస్. దేవేందర్ లను నవీపేట్లో అర్ధరాత్రులు అరెస్ట్ చేసే నిర్బంధించారని వారు తెలిపారు. అసెంబ్లీ బడ్జెట్ సమావేశాల సందర్భంగా పెట్టిన బడ్జెట్ ప్రసంగంలో ఈ ప్రభుత్వం ఇచ్చిన ఆరు గ్యారెంటీల పథకంలో భాగంగా ఇచ్చిన హామీల అమలుకు నిధులు కేటాయించకపోవడంతో తమ సమస్యల పరిష్కారం కోసం ఆయా ప్రజా సంఘాలు తమ నిరసనను వెలబుచ్చటానికి చలో హైదరాబాద్కు పిలుపునిస్తే దాన్ని నిల్వరించటానికి కొరకు ప్రజల సమస్యలపై నిరంతరం గొంతెత్తి మాట్లాడే పార్టీ కార్యకర్తలను ప్రజాసంఘాల నాయకులను అక్రమంగా నిర్బంధించటం మూలంగా ప్రజలు మర్చిపోతారు అనుకుంటే సరైంది కాదని గతంలో టిఆర్ఎస్ పార్టీ ఏ విధంగా ప్రజా ఉద్యమాలను నిర్బంధం ద్వారా అనుచాలని చూస్తే ఏ గతి పట్టిందో అందరికీ తెలుసని కాంగ్రెస్ పార్టీ అదే పద్ధతి పాటిస్తే కాంగ్రెస్ పార్టీ పాలకులు కూడా ప్రజలు తగిన గుణపాఠం చెప్తారని హెచ్చరించారు ప్రజా సమస్యలపై మాట్లాడే వెలిబుచ్చే అవకాశం కల్పించకుండా ప్రజా పాలన అని చెప్తూ మాయ ముచ్చటం సరేంది కాదని వారు అన్నారు ఇప్పటికైనా ప్రభుత్వం నిర్బంధ చర్యలను మానుకొని ప్రజలకు ఇచ్చిన హామీల అమలు కోసం బడ్జెట్లో సవరణలు తీసుకొచ్చి అక్రమంగా అరెస్టు లను ఉపసంహరించుకోవాలని అన్నారు.