*విద్యారంగానికి అరకొర నిధులు కేటాయించడం సరైనది కాదు. బడ్జెట్ ను సవరించి నిధులు పెంచాలి పి.డి.ఎస్.యూ ప్రిన్స్ డిమాండ్.
A9 న్యూస్ ప్రతినిధి:
విద్యారంగానికి అరకొర నిధులు కేటాయించడం సరైనది కాదు. బడ్జెట్ ను సవరించి నిధులు పెంచాలిని పి.డి.ఎస్.యూ తెలంగాణ యూనివర్సిటీ నాయకులు ప్రిన్స్ డిమాండ్ చేశారు ఆనంతరం ఆయన మాట్లాడుతూ కాంగ్రెస్ పార్టీ ఎన్నికల మేనిఫెస్టోలో బడ్జెట్ లో విద్యారంగానికి 15% నిధులు కేటాయిస్తామని హామీ ఇచ్చింది కాని 23,108 కోట్లు మాత్రమే కేటాయించింది. మొత్తం 3,04,965 కోట్ల రాష్ట్ర బడ్జెట్ లో ఇది కేవలం 7.57% నిధులు మాత్రమే. ఎప్పటినుండో విద్యావేత్తలు, మేధావులు, విద్యార్థి సంఘాలు విద్యారంగం బాగుపడాలంటే కనీసం విద్యారంగానికి బడ్జెట్ లో 20% నిధులు కేటాయించాలని కోరుతున్నారు. నేడు అసెంబ్లీలో ప్రవేశపెట్టిన బడ్జెట్ ను చూస్తే రేవంత్ రెడ్డి సర్కార్ కూడా విద్యారంగాన్ని నిర్లక్ష్యం చేస్తుందని స్పష్టంగా అర్థమవుతుంది. ఇప్పటికే దాదాపు 8000 కోట్ల ఫీజు రియంబర్స్మెంట్, స్కాలర్షిప్స్ పెండింగ్ లో ఉన్నాయి. ప్రభుత్వ పాఠశాలలు కళాశాలలు కనీస సదుపాయాలు లేక కూనరిల్లుతున్నాయి. విద్యారంగం బాగుపడాలంటే ఈ నిధులు సరిపోవు. కాబట్టి బడ్జెట్ ను సవరించి విద్యారంగానికి మరిన్ని నిధులు కేటాయించాలని మరియు తెలంగాణ యూనివర్సిటీ రెండు వందల కోట్లు నిధులు కుదా కేటాయించాలని పి.డి.ఎస్.యూ గా డిమాండ్ చేశారు. లేని యెడల పెద్ద ఎత్తున ఆందోళన కార్యక్రమాలు చెప్పడతామని ఆయన హెచ్చరించారు. ఈ కార్యక్రమంలో తే.యూ పి.డి.ఎస్.యూ యూనివర్సిటీ నాయకులు రవీందర్, మోహిత్, హుస్సేన్, రాహుల్, భీమ్, ఆకాష్, తరుణ్ తదితరులు పాలుగోన్నారు.