*ఓ కానిస్టేబుల్ ను ఢీకొనడంతో అక్కడికక్కడే మృతి చెందాడు….
A9 న్యూస్ ప్రతినిధి:
కామారెడ్డి జిల్లా గాంధారి మండల కేంద్రంలో ఈ ఘటన చోటు చేసుకుంది. మృతి చెందిన కానిస్టేబుల్ రవి (38) గా గుర్తించారు. గాంధారి పోలీస్ స్టేషన్లో పనిచేస్తున్న రవి అనే కానిస్టేబుల్ సుభాష్ అనే కానిస్టేబుల్ తో కలిసి బుధవారం రాత్రి పెట్రోలింగ్ నిర్వహించారు. గురువారం తెల్లవారుజామున మూడు గంటల ప్రాంతంలో గాంధారి బస్టాండ్ సమీపంలో రవి, సుభాష్ లు విధులు నిర్వహిస్తుండగా అతివేగంగా అజాగ్రత్తగా వచ్చిన కారు రవిని ఢీ కొట్టగా. దీంతో రవి అక్కడికక్కడే మృతి చెందాడు. అలాగే రవితో పాటు సుభాష్ కారును గమనించడంతో స్వల్ప గాయాలతో బయటపడ్డాడు. మృతి చెందిన రవి మృతదేహాన్ని కామారెడ్డి ప్రభుత్వ ఆసుపత్రికి తరలించారు. రవి స్వస్థలం కామారెడ్డి మున్సిపల్ పరిధిలోని దేనవునిపల్లి వాసిగా గుర్తించారు. మృతునికి భార్య సౌఖ్య, ముగ్గురు పిల్లలు రసజ్ఞ, రవిజ్ఞ, రితేష్ చంద్ర పిల్లలు ఉన్నారు. రవి మృతితో తోటి పోలీస్ సిబ్బంది కన్నీటిపర్యమయ్యారు. కుటుంబంలో విషాద ఛాయలు అలుముకున్నాయి. రవి గతంలో జిల్లా కేంద్రంలోని ఎస్పీ కార్యాలయంలోని స్పెషల్ బ్రాంచ్ లో కంప్యూటర్ ఆపరేటర్ గా పనిచేసి ఇటీవలే గాంధారికి బదిలీ అయ్యాడు. మృతి చెందిన కానిస్టేబుల్ రవి మృతదేహంపై పుష్పగుచ్చం ఉంచి జిల్లా ఎస్పీ రాజేష్ చంద్ర నివాళులు అర్పించారు. కానిస్టేబుల్ కుటుంబ సభ్యులను జిల్లా ఎస్పీ రాజేష్ చంద్ర ఓదార్చారు. అనంతరం సదాశివనగర్ సీఐ సంతోష్ కుమార్ మాట్లాడుతూ.. తెల్లవారుజామున మూడు గంటల ప్రాంతంలో గాంధారి మండల కేంద్రంలోని గాంధీ చౌక్ వద్ద పెట్రోలింగ్ నిర్వహిస్తున్న రవి, సుభాష్ ల పైకి కారు అతివేగంగా దూసుకు రావడ్డంతో రవికి తీవ్ర గాయాలయి అక్కడికక్కడే మృతి చెందాడు. సుభాష్ చాకచక్యంతో తప్పించుకోవడంతో ప్రాణాలతో బయటపడ్డాడు అని సీఐ తెలిపారు. ఈ ప్రమాదంలో కానిస్టేబుల్ సుభాష్, కార్ డ్రైవర్ సన్నీత్ కు గాయాలయ్యాయి. కారు డ్రైవర్ పోలీసుల అదుపులో ఉన్నట్లుగా సమాచారం. కానిస్టేబుల్ రవి భార్య సౌఖ్య ఫిర్యాదు మేరకు కేసు నమోదు చేసి దర్యాప్తు చేస్తున్నట్లు సదాశివనగర్ సీఐ సంతోష్ కుమార్ తెలిపారు.