A9 న్యూస్ ప్రతినిధి:
తెలంగాణ రాష్ట్ర అసెంబ్లీ బడ్జెట్ సమావేశాలలో విద్యారంగానికి 20 శాతం నిధులు కేటాయించి జిల్లాలో ప్రభుత్వ ఇంజనీరింగ్ కళాశాల ఏర్పాటు చేయాలని పి డి ఎస్ యూ జిల్లా ప్రధాన కార్యదర్శి జన్నారాపు రాజేశ్వర్ డిమాండ్ చేశారు.
ఈ సందర్భంగా నిజామాబాద్ నగరంలో పి డి ఎస్ యూ ఆధ్వర్యంలో ధర్నా కార్యక్రమం చేయటం జరిగింది.
ఈ సందర్భంగా నాయకులు మాట్లాడుతూ తెలంగాణ రాష్ట్రంలో విద్యారంగాన్ని కేసీఆర్ ప్రభుత్వం బ్రష్టు పట్టించిందని, విద్యార్థులు లేరనే నెపంతో వేల సంఖ్యలో ప్రభుత్వ స్కూల్స్ ముసివేశారని, నేడు ప్రభుత్వ స్కూల్స్ లో కనీస సౌకర్యాలు లేకుండా ఉన్నాయని, శిధిలావస్థలో కూలిపోయే పరిస్థితిలో అనేక పాఠశాలలు ఉన్నాయని, యూనివర్సిటీలలో రిక్రూట్మెంట్ జరగడంలేదని యూనివర్సిటీలో కూడా అధిక నిధులు కేటాయించాలని, ప్రభుత్వ ఇంటర్నేషనల్ స్కూల్స్ పూర్తి చేసి ప్రారంభించాలని. పెండింగ్ లో ఉన్న స్కాలర్షిప్ ఫీజు రియంబర్స్ మెంట్ నిధులను విడుదల చేయాలని.
నిజామాబాద్ జిల్లాలో ప్రభుత్వ ఇంజనీరింగ్ కాలేజీ మరియు మహిళా డిగ్రీ కళాశాల, ఇండోర్ స్టేడియం ను నిర్మించాలని డిమాండ్ చేశారు. విద్యారంగాన్ని నిర్లక్ష్యం చేస్తే ఆందోళనలు తప్పవని హెచ్చరించారు. ఈ కార్యక్రమంలో పి డి ఎస్ యూ నాయకులు ప్రిన్స్, రాహుల్, మహేష్, రాజు, నిఖిల్, వాసు, అక్షయ్, వంశి, రవీందర్ తదితరులు పాల్గొన్నారు.