A9 న్యూస్ ప్రతినిధి:
శాంతి రక్షణ ల పర్యవేక్షణలో నిరంతరం అప్రమత్తంగా ఉండే పోలీసులు తమ భారీ కేట్లను చెరువులో పడేసిన పట్టించుకోకుండా అలానే వదిలేసిన ఘటన ఆర్మూర్ పట్టణం లో చేటు చేసుకుంది. ఆర్మూర్ పట్టణ కేంద్రంలోని మల్లెచెరువు ప్రాంతంలో ట్రాఫిక్కు అంతరాయం కలగకుండా వాడే భారికేట్లను దుండగులు తీసుకెళ్లి చెరువులో పారవేయడం జరిగింది. గత కొన్ని రోజులుగా చెరువులోనే భారికేట్ ఉన్న ఇప్పటివరకు ఇటు మునిసిపల్ సిబ్బంది, అటు పోలీస్ సిబ్బంది ఎవరు పట్టించుకోకుండా ఉండడంతో వచ్చి పోయే ప్రజలకు అధికారుల నిర్లక్ష్యం పై అనుమానాలకు తావిస్తుంది. ఇకనైనా సంబంధిత అధికారులు చర్యలు తీసుకొని భారీ కేట్లు చెరువు నుంచి బయటకు తీయాలని ప్రజలు కోరుకుంటున్నారు.