A9 న్యూస్ ప్రతినిధి ఆర్మూర్:
బిడి కార్మికులకు పెరిగిన కరువు బత్యం వి డి ఏ అమలు చేయాలి యూనియన్ రాష్ట్ర అధ్యక్షులు బి.భూమన్న ప్రధాన కార్యదర్శి బి.సూర్య శివాజీ
ఆర్మూర్ లో గల ఐ.ఎఫ్.టి.యూ కార్యాలయంలో జరిగిన విలేకరుల సమావేశంలో మాట్లాడుతూ భారతదేశ వ్యాప్తంగా బీడీ పరిశ్రమపై ఆధారపడి అరవై లక్షల మంది జీవిస్తున్నారు అని కేంద్ర ప్రభుత్వం బీడి పరిశ్రమను కాపాడాల్సింది పోయి బీడీ పరిశ్రమపై 28 శాతం జిఎస్టి విధించి పరిశ్రమను పూర్తిగా సంక్షోబంలోకి నెట్టిoదాన్ని విమర్శించారు పని లేక పని దినాలు లేక కార్మికులు అనేక అష్ట కష్టాలకు ఎదుర్కొంటున్నారని వారన్నారు ఇప్పటికైనా కేంద్ర ప్రభుత్వం బీడి పరిశ్రమపై విధించిన 28శాతం జీఎస్టీని ఎత్తివేయాలని కేంద్ర ప్రభుత్వాన్ని డిమాండ్ చేశారు మరియు బీడీ కార్మికుల పోరాటాల ఫలితంగా 1994లో కరువు బత్యం వి డి ఏ అమలు అవుచున్నాది 2024 సంవత్సరం మినిమయ ధరల చూసి 18O9 పాయింట్ల నుండి 1913 పెరిగింది అంటే 1O4 పాయింట్లు పెరిగింది ప్రతి పాయింట్ కు పది పైసల చొప్పున 10 రూపాయల 4O పైసలు పెరిగింది అన్నింటిని కలుపుకొని 11 రూపాయల 94 పైసలు పెరిగింది మొత్తం వైబిలకు రూపాయలు 261.97 పైసలు ఈ పెరుగుదల ఏప్రిల్ నెల ఒకటో తేదీ 2025 నుండి అమల్లోకి వస్తుందని వారు తెలిపారు ప్యాకింగ్ కార్మికులకు నెలసరి వేతన ఉద్యోగస్తులకు ఎంత అనేది లెక్కించి కట్టివాల్సింది ఉంటుందన్నారు. ఈ పెరిగిన కరువు భత్యం వీడియోను అమలు చేయాలని బీడీ యజమాన్యాలకు వారు డిమాండ్ చేశారు అమలు చేయని పక్షంలో కార్మికులతో ఆందోళన కార్యక్రమాలు చేయవలసి వస్తుందని తెలియజేశారు రాష్ట్ర ప్రభుత్వం పెరిగిన కరువు బత్యం వి డి ఏ హమాలోకో చార్యలు తీసుకోవాల్సిందిగా డిమాండ్ చేస్తున్నమన్నారు బీడీ కార్మికులు ప్యాకింగ్ కార్మికులు నెలసరి వేతన ఉద్యోగస్తులు పెరిగిన కరువు బత్తాన్ని అమలు చేయించుకునే విధంగా ప్రయత్నించాలని కార్మికులను కోరారు. ఈ పెరిగిన కరువు భత్యం వి డి ఏ నిజామాబాద్, కామారెడ్డి, అదిలాబాద్, నిర్మల్, మంచిరాల, కరీంనగర్, జగిత్యాల్, సిరిసిల్ల, సిద్దిపేట్, మెదక్ జిల్లాలో పనిచేస్తున్న ఏడు లక్షల మంది కార్మికులకు వర్తిస్తుందని వరు తెలియజేశారు.
ఈ విలేకరుల సమావేశంలో జిల్లా కార్యదర్శి జే.గంగాధర్ సహయ కార్యదర్శి ఎం.భారతి తదితరులు పాల్గొన్నారు.