*(సూర్యాపేట టౌన్, మార్చి* *11* )

 

 

రాష్ట్ర ప్రభుత్వం ఎల్ ఆర్ఎస్ కోసం ఈ నెల 31 వరకే దరఖాస్తు చేసుకోవాలని ప్రకటించడం సరికాదని, ఎల్ ఆర్ ఎస్ ప్రక్రియ నిరంతరం కొనసాగించాలని సూర్యాపేట జిల్లా రియల్ ఎస్టేట్ వ్యాపార అసోసియేషన్ అధ్యక్షులు పంతంగి వీరస్వామి గౌడ్ కోరారు. మంగళవారం సూర్యాపేట జిల్లా కేంద్రంలోని ఆ సంఘం కార్యాలయంలో ఆయన మాట్లాడారు. కట్ ఆఫ్ డేటు ప్రభుత్వం ప్రకటించడం వల్ల ప్రజలు తీవ్ర ఆందోళనకు గురవుతున్నారని చెప్పారు. నిరంతర ప్రక్రియగా కొనసాగిస్తే ప్రజలు భవన నిర్మాణాలు చేసుకునే సందర్భంలో క్రమబద్ధీకరణ చేసుకుంటారని తెలిపారు. ప్రభుత్వం బలవంతంగా ఎల్ఆర్ఎస్ పేరుతో ప్రజలను ఇబ్బందులకు గురి చేయడం సరికాదన్నారు. బఫర్ జోన్ కు,

ఎఫ్ టి ఎల్ కు జీవోలో కేవలం 30 మీటర్ల దూరం మాత్రమే అని ప్రకటించి ప్రస్తుతం 200 మీటర్లు వరకు అని ప్రకటించడం విడ్డూరంగా ఉందన్నారు. ప్రజలు ఆందోళనకు గురై సబ్ రిజిస్టర్ కార్యాలయంలో చుట్టూ తిరుగుతున్నప్పటికీ అధికారులు మాత్రం స్పష్టమైన ఆదేశాలు రాలేదని చెప్పడంతో ప్రజలు మరింత ఆందోళన చెందుతున్నారని వివరించారు. ప్రభుత్వం 457 జీవోను రద్దు చేయాలని అన్నారు. సబ్ రిజిస్టర్ కార్యాలయాలకు ప్రత్యేక పక్కాభవనాలు నిర్మించి మౌలిక వసతులు కల్పించాలని ప్రభుత్వాన్ని డిమాండ్ చేశారు. ఈ కార్యక్రమంలో రియల్ ఎస్టేట్ పట్టణ అధ్యక్షుడు జలగం సత్యం గౌడ్ రియల్ ఎస్టేట్ జిల్లా గౌరవ సలహాదారుడు దేవత్ కిషన్ నాయక్ జిల్లా ప్రధాన కార్యదర్శి వెన్న శ్రీనివాస్ రెడ్డి జిల్లా కోశాధికారి పాల సైదులు జిల్లా కార్యదర్శి ఖమ్మంపాటి అంజయ్య గౌడ్ అయితే గాని మల్లయ్య గౌడ్ ఏలుగూరి రమా కిరణ్ గౌడ్ వెంకన్న ఆకుల మారయ్య గౌడ్ పట్టేటి రమా కిరణ్ కోటేష్ నీలయ ఎస్ కే బాబా మైసయ్య ఎల్లారావు బానోతు జారి నాయక్ తదితరులు పాల్గొన్నారు.

By Admin

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *