పంట పొలంలో విషాదం.. విద్యుత్ ఘాతంతో కోటార్మూర్‌కు చెందిన వ్యక్తి మృతి……

On: Sunday, July 5, 2026 3:21 PM

* పంట పొలంలో విషాదం.. విద్యుత్ ఘాతంతో కోటార్మూర్‌కు చెందిన వ్యక్తి మృతి……

A9 న్యూస్:

ఆర్మూర్ పట్టణంలోని కోటార్మూర్‌కు చెందిన పన్నీరు శ్రీనివాస్ విద్యుత్ ఘాతానికి గురై మృతి చెందిన విషాద ఘటన ఆదివారం చోటుచేసుకుంది. సమాచారం మేరకు, శ్రీనివాస్ పంట పొలంలో నీటి మోటారును మరమ్మతు చేసేందుకు వెళ్లారు ప్రమాదవశాత్తు విద్యుత్ షాక్‌కు గురయ్యారు. గాయపడిన ఆయన అక్కడికక్కడే మృతి చెందినట్లు స్థానికులు తెలిపారు. ఘటన విషయం తెలుసుకున్న పోలీసులు వెంటనే సంఘటనా స్థలానికి చేరుకుని పరిశీలించారు. అనంతరం మృతదేహాన్ని పోస్టుమార్టం నిమిత్తం ఆర్మూర్ ప్రభుత్వ ఆసుపత్రికి తరలించారు. ఈ ఘటనపై కేసు నమోదు చేసుకున్న పోలీసులు. మృతుడి కుటుంబ సభ్యులు, బంధువులు శోకసంద్రంలో మునిగిపోయారు.

06 Jul 2026

Leave a Comment