జాబ్ మేళాలను యువత సద్వినియోగం చేసుకోవాలి: బుస్సాపూర్ శంకర్…..

On: Thursday, July 2, 2026 10:24 PM

A9 న్యూస్ 

నిజామాబాద్‌లో జిల్లా ఉపాధి శాఖ ఆధ్వర్యంలో, TOMCOM సహకారంతో నిర్వహించిన విదేశీ ఉద్యోగాల జాబ్ మేళాలో బీజేపీ నేత, బుస్సాపూర్ శంకర్ పాల్గొన్నారు. ఈ సందర్భంగా ఆయన మాట్లాడుతూ, యువత ఉద్యోగ అవకాశాలను అందిపుచ్చుకునేందుకు నైపుణ్యాలను పెంపొందించుకోవాలని సూచించారు. ప్రభుత్వం యువతకు నైపుణ్యాభివృద్ధి, ఉపాధి కల్పన, విదేశీ ఉద్యోగాలపై మరింత ప్రోత్సాహం అందించాలని కోరారు. అలాగే ప్రభుత్వం నిర్వహిస్తున్న జాబ్ మేళాలను యువత సద్వినియోగం చేసుకుని తమ భవిష్యత్తును తీర్చిదిద్దుకోవాలని పిలుపునిచ్చారు. కార్యక్రమంలో జిల్లా ఉపాధి శాఖ అధికారులు, TOMCOM ప్రతినిధులు, ఉద్యోగార్థులు పాల్గొన్నారు.

02 Jul 2026

Leave a Comment