- రాష్ట్ర కార్యవర్గ సభ్యుడిగా నియమితులైన కంచెట్టి గంగాధర్‌కు ఘన సన్మానం….
A9 న్యూస్
ఆలూరు మండల అధ్యక్షులు శ్రీకాంత్ ఆధ్వర్యంలో రాష్ట్ర కార్యవర్గ సభ్యుడిగా నియమితులైన కంచెట్టి గంగాధర్‌కు ఘన సన్మాన కార్యక్రమం నిర్వహించారు. ఈ సందర్భంగా నాయకులు గంగాధర్‌కు శాలువా కప్పి, పూలమాల వేసి అభినందనలు తెలిపారు. వక్తలు మాట్లాడుతూ, పార్టీ బలోపేతానికి కంచెట్టి గంగాధర్ చేస్తున్న సేవలను గుర్తించి రాష్ట్ర కార్యవర్గ సభ్యుడిగా బాధ్యతలు అప్పగించడం గర్వకారణమని పేర్కొన్నారు. కొత్త బాధ్యతల్లో ఆయన విజయవంతంగా ముందుకు సాగాలని ఆకాంక్షించారు. ఈ కార్యక్రమంలో కల్లెడ గ్రామ సర్పంచ్ ప్రణయ్ తేజ్, ఆర్మూర్ కౌన్సిలర్ కందేశ్ ప్రశాంత్‌తో పాటు బీజేపీ, బీజేవైఎం నాయకులు, కార్యకర్తలు పాల్గొని గంగాధర్‌కు శుభాకాంక్షలు తెలిపారు.








