A9 న్యూస్
ఆర్మూర్ పట్టణంలో పోలీసు శాఖ ఆధ్వర్యంలో నిర్వహిస్తున్న ‘మన కాలనీ – మన భద్రత, మన బాధ్యత’ కార్యక్రమంలో భాగంగా ఎస్సై రజినీకాంత్ డ్రగ్స్ అవగాహన కార్యక్రమాన్ని నిర్వహించారు. ఈ సందర్భంగా శ్రీ చైతన్య హై స్కూల్లో విద్యార్థులకు ట్రాఫిక్ నిబంధనలు, మత్తు పదార్థాల దుష్ప్రభావాలు, సైబర్ నేరాల నివారణ, సీసీ కెమెరాల ప్రాధాన్యం, షీ టీం సేవలపై అవగాహన కల్పించారు. చట్టాలను పాటిస్తూ అప్రమత్తంగా ఉండాలని, అనుమానాస్పద ఘటనలు కనిపిస్తే వెంటనే పోలీసులకు సమాచారం అందించాలని సూచించారు.విద్యార్థులు కార్యక్రమంలో ఉత్సాహంగా పాల్గొని పోలీసు అధికారులు అందించిన సూచనలను ఆసక్తిగా విన్నారు.








