మాక్లూర్ మండలం మదన్పల్లి గ్రామంలో నూతనంగా నిర్మించిన శ్రీ నీలకంఠేశ్వర శివాలయాని దర్శించుకున్న ఎమ్మెల్యే పైడి రాకేష్ రెడ్డి…..

On: Thursday, July 2, 2026 10:12 AM

* మదన్‌పల్లి నూతన శ్రీ నీలకంఠేశ్వర ఆలయాన్ని దర్శించుకున్న ఎమ్మెల్యే పైడి రాకేష్ రెడ్డి…..


* 9 ఏళ్ల సంకల్ప దీక్షను పూర్తి చేసిన మాజీ ఎంపీటీసీ సభ్యులు గోవూరు ఓడ్డెన్న…..

మాక్లూర్ మండలం మదన్‌పల్లి గ్రామంలో నూతనంగా నిర్మించిన శ్రీ నీలకంఠేశ్వర శివాలయాన్ని ఎమ్మెల్యే పైడి రాకేష్ రెడ్డి దర్శించుకుని ప్రత్యేక పూజలు నిర్వహించారు. అనంతరం ఆలయ అర్చకులు అందజేసిన తీర్థప్రసాదాలను స్వీకరించి భక్తులతో కలిసి ఆలయ విశేషాలను తెలుసుకున్నారు. ఈ సందర్భంగా ఆలయ నిర్మాణంలో విశేష సేవలందించిన మాజీ ఎంపీటీసీ సభ్యులు గోవూరు ఓడ్డెన్న ప్రత్యేక ఆకర్షణగా నిలిచారు. శ్రీ నీలకంఠేశ్వర ఆలయ నిర్మాణం పూర్తయ్యే వరకు పాదరక్షలు ధరించబోనని చేసిన సంకల్పంతో గత తొమ్మిది సంవత్సరాలుగా కఠిన దీక్షను పాటించారు. ఆలయ నిర్మాణం పూర్తై ప్రతిష్ఠా కార్యక్రమాలు విజయవంతంగా ముగియడంతో గోవూరు ఓడ్డెన్న తన తొమ్మిదేళ్ల సంకల్ప దీక్షను నేటితో పూర్తి చేసి పాదరక్షలు ధరించారు. ఆయన భక్తి, అంకితభావాన్ని గ్రామస్థులు, భక్తులు ప్రశంసించారు. ఈ సందర్భంగా ఎమ్మెల్యే పైడి రాకేష్ రెడ్డి గోవూరు ఓడ్డెన్న భక్తి, పట్టుదలను అభినందిస్తూ, ఆలయ నిర్మాణానికి సహకరించిన ప్రతి ఒక్కరికీ శుభాకాంక్షలు తెలిపారు. గ్రామ ప్రజలు పెద్ద సంఖ్యలో పాల్గొని భక్తిశ్రద్ధలతో కార్యక్రమాన్ని విజయవంతం చేశారు.

02 Jul 2026

Leave a Comment