A9 న్యూస్ ప్రతినిధి:

 

మాక్లూర్ మండల కేంద్రంలోని ఎస్ ఆర్ ఫంక్షన్ హాల్లో జరిగిన మీటింగ్ లో మాక్లూర్ మండల గ్రామాలకు సంబంధించిన ఇటీవల ప్రభుత్వం నుండి వచ్చిన

షాది ముబారక్ మరియు సీఎం రిలీఫ్ ఫండ్ కి సంబందించిన ప్రొసీడింగ్స్ కాపీ లను వివిధ గ్రామాల కాంగ్రెస్ పార్టీ నాయకులకు అందచేశిన ఆర్మూర్ నియోజకవర్గ కాంగ్రెస్ పార్టీ ఇంచార్జ్ ప్రొద్దుటూరి వినయ్ కుమార్ రెడ్డి. మాట్లాడుతూ రాష్ట్రంలో మన ప్రభుత్వం ఉంది ముఖ్యమంత్రి మన రేవంత్ రెడ్డి ఉండడం వలన ఈ అభివృద్ధి పనులకు నిధులు తీసుకురావడం జరిగింది. అలాగే ఈ నిధులు ఆర్మూర్ నియోజక వర్గానికి తీసుకురావడానికి సహకరించిన జిల్లా ఇన్చార్జి మంత్రి ఎక్సైజ్ మరియు పర్యాటకశాఖ జూపల్లి కృష్ణారావు కి మరియు పిసిసి అధ్యక్షులు మహేష్ కుమార్ గౌడ్ కి మాజీ మంత్రి బోధన్ శాసనసభ్యులు ప్రొద్దుటూరి సుదర్శన్ రెడ్డి ఎంతో కృషి చేయడం జరిగింది.

రానున్న రోజులలో స్థానిక సంస్థలకు సంబంధించిన ఎలక్షన్లలో మన కాంగ్రెస్ పార్టీకి సంబంధించిన సర్పంచులను ఎంపీటీసీలను, జడ్పిటిసి లను గెలిపించుకొని కాంగ్రెస్ పార్టీ చేస్తున్న అభివృద్ధిలో అందరు భాగస్వాములు కావాలని కోరడం జరిగింది. ఇదే కాక మీ గ్రామాలలో ఎటువంటి ఇబ్బందులు ఉన్న దానికి నిధులు సమకూర్చి గ్రామాభివృద్ధికి నేను తప్పకుండా కృషి చేస్తానని, సంబంధిత మంత్రుల దగ్గరకు వెళ్లి నిధులు సమకూరుస్తానని మీకు హామీ ఇస్తున్నాను. కాంగ్రెస్ పార్టీ ఇస్తున్న సంక్షేమ పథకాలను ఆరు గ్యారెంటీలను ప్రజల వద్దకు తీసుకెళ్లి నిరుపేదలైన అర్హులైన కుటుంబాలకు లబ్ధి చేకూర్చాలని కాంగ్రెస్ పార్టీ నాయకులకు కార్యకర్తలకు చెప్పడం జరిగింది.

 

ఈ కార్యక్రమంలో మక్లూరు మండల కాంగ్రెస్ పార్టీ అధ్యక్షులు రవి, మార్కెట్ యార్డ్ నిజామాబాద్ కమిటీ సభ్యులు మరియు బ్లాక్ కాంగ్రెస్ పార్టీ అధ్యక్షులు వెంకటేశ్వరరావు పటేల్, మాక్లూరు సోసైటీ చైర్మన్ అశోక్, కాంగ్రెస్ పార్టీ నాయకులు, కార్యకర్తలు తదితరులు పాల్గొన్నారు.

By Admin

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *